సర్దార్‌కు కాజల్‌ సెంటిమెంట్‌

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం నటిస్తున్న ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రం చివరి దశకు చేరుకుంది.ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్ది ప్రమోషన్‌ను భారీగా చేస్తున్నారు.

 Kajal As Radhanpur Princess In Sardaar Movie-TeluguStop.com

మరి కొన్ని రోజుల్లో ఆడియోను విడుదల చేసి, వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే.

భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాలో కాజల్‌ నటించడంతో పవన్‌ ఫ్యాన్స్‌ ‘మగధీర’ సెంటిమెంట్‌ను గుర్తుకు తెస్తున్నారు.

‘మగధీర’ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన కాజల్‌ యువ రాణి పాత్రలో కనిపించిన విషయం తెల్సిందే.

ఆ చిత్రం ఘన విజయం సాధించింది.మళ్లీ ఇప్పుడు ‘సర్దార్‌ గబ్బర్‌సింగ్‌’ చిత్రంలో కాజల్‌ రతన్‌ పూర్‌ యువరాణిగా కనిపించబోతుంది.

కాజల్‌ యువరాణిగా నటించిన సినిమాలు తప్పకుండా హిట్‌ అవుతాయి అంటూ మెగా ఫ్యాన్స్‌ చంకలు గుద్దుకుంటున్నారు.మరి కాజల్‌ సెంటిమెంట్‌ ఈ సినిమాకు వర్కౌట్‌ అయ్యి, సర్దార్‌ సూపర్‌ హిట్‌ అవుతుందేమో చూడాలి.

ఈ చిత్రాన్ని శరత్‌ మారార్‌ మరియు పవన్‌ కళ్యాణ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.‘పవర్‌’ ఫేం బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతాన్ని అందించాడు.

ఇప్పటికే విడుదలైన మేకింగ్‌ వీడియో మరియు పోస్టర్‌లు సినిమాపై అంచనాలను ఆకాశానికి చేర్చాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube