భర్తని హీరోగా చేయబోతున్న కాజల్..!

Kajal Agarwal Wants Her Husband Gautham Kichlu Turn As Actor, Tollywood , Kaja Agrawal , Gutam Kichlu , Kajal Marrege , Kajal Agrawal News

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో గౌతం కిచ్లుని పెళ్లాడిన విషయం తెలిసిందే.కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న వీరు పెళ్లితో ఒకటయ్యారు.

 Kajal Agarwal Wants Her Husband Gautham Kichlu Turn As Actor, Tollywood , Kaja A-TeluguStop.com

పెళ్లి తర్వాత కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటున్న కాజల్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాలకు మాత్రం సైన్ చేస్తుంది.ప్రస్తుతం కాజల్ ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా కోసం రెడీ అవుతుంది.

పెళ్లి తర్వాత కాజల్ ఎక్కడ షూటింగ్ ఉన్నా సరే తన భర్తని కూడా వెంట తిప్పుతుందని తెలుస్తుంది.అంతేకాదు లేటెస్ట్ గా తను చేస్తున్న సినిమాల్లో తన భర్త గౌతం కిచ్లుకి ఒక పాత్ర ఇవ్వమని అడుగుతుందట.

కాజల్ హస్బండ్ గౌతం కూడా అందంగా హీరో క్వాలిటీస్ తో ఉంటాడు. బిజినెస్ మెన్ అయిన గౌతం ఎప్పుడు తెర మీద కనిపించాలని అనుకోలేదు.కాని కాజల్ అతన్ని సిల్వర్ స్క్రీన్ పై చూడాలని ముచ్చటపడుతుందట.అందుకే తన దర్శక నిర్మాతలకు భర్త గురించి రిఫర్ చేస్తుందట కాజల్.

అతన్ని కూడా నటుడిని చేసి ఇద్దరు సినిమాలతో బిజీ అవ్వాలని చూస్తున్నారు.మరి గౌతం కిచ్లుని నటుడిని చేయాలని కోరుతున్న కాజల్ ఆశలకు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

 కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube