మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఫస్ట్ సౌత్ హీరోయిన్  

Kajal Agarwal To Get A Wax Statue In Madame Tussauds - Telugu Kajal Agarwal, Kollywood, Madame Tussauds, South Heroine, Tollywood, Wax Statue

సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కాజల్.దశాబ్దంకి పైగా హీరోయిన్ గా సౌత్ లో స్టార్ హీరోలందరితో జత కట్టిన ఈ భామ ప్రస్తుతం సోలోగా ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది.

Kajal Agarwal To Get A Wax Statue In Madame Tussauds

మరో వైపు సీనియర్ కేటగిరీలోకి వెళ్ళిపోయినా ఈ భామని సౌత్ హీరోలు కూడా ఇంచుమించు పక్కన పెట్టారు.ఇదిలా ఉంటే ఇప్పుడు కాజల్ సౌత్ లో ఏ హీరోయిన్ కి సొంతం కాని ఘనత సొంతం చేసుకుంది.

సింగపూర్ లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వారు కాజల్ మైనపు బొమ్మని అకక్డ పెట్టేందుకు రెడీ అయ్యారు.దీనికి సంబంధించి ఇప్పటికే కొలతలు కూడా తీసుకున్నారు.

ఇండియన్ సెలబ్రిటీల మైనపు బొమ్మలని సింగపూర్ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆకర్షణగా పెడతారు.వీటిని చూడటానికి ఎంతో మంది పర్యాటకులు వస్తూ ఉంటారు.ఈ ఇప్పటికే ఇండియాలో చాలా మంది బాలీవుడ్ సెలబ్రిటీల మైనపు బొమ్మలు అక్కడ పెట్టారు.అయితే సౌత్ లో మాత్రం సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మైనపు బొమ్మలు మాత్రమే ఇప్పటి వరకు ఉన్నాయి.

అయితే సౌత్ లో ఇంకా చాలా మంది స్టార్ హీరోలు ఉన్నా కూడా వారిని పక్కన పెట్టి కాజల్ మైనపు బొమ్మ పెట్టడానికి రెడీ అవ్వడం విశేషం.మొత్తానికి గొప్పతనం పొందడం ద్వారా సౌత్ లో ఈ ఘనత సాధించిన మొదటి హీరోయిన్ గా కాజల్ నిలవడం విశేషం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Agarwal To Get A Wax Statue In Madame Tussauds Related Telugu News,Photos/Pics,Images..

footer-test