నిజజీవితంలో మోసపోయా.. కాజల్ సంచలన వ్యాఖ్యలు..?

స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ వరుసగా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.కాజల్ ప్రధాన పాత్రలో మంచు విష్ణుకు అక్కగా నటిస్తున్న మోసగాళ్లు సినిమా ఈ నెల 19వ తేదీన విడుదల కానుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్న కాజల్ అగర్వాల్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

 Kajal Agarwal Speech In Mosagallu Movie Pre Release Event-TeluguStop.com

పెళ్లి తర్వాత మహిళలపై మరింతగా గౌరవం పెరిగిందని కాజల్ అన్నారు.

పెళ్లి చేసుకుని తాను మహిళను అయినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె పేర్కొన్నారు.

మోసగాళ్లు సినిమాలో తాను అను అనే పాత్రలో నటించగా విష్ణు అర్జున్ అనే పాత్రలో నటిస్తున్నాడని కాజల్ తెలిపారు.కథ నచ్చడం వల్లే సినిమాలో మంచు విష్ణుకు అక్కగా నటించానని ఆమె అన్నారు.

మోసగాళ్లు సినిమాను మోహన్ బాబు చూసి తన నటనను ప్రశంసించారని కాజల్ వెల్లడించారు.

Telugu Rupees, Kajal Agarwal, Mosagallu-Movie

అయితే నిజ జీవితంలో తాను మూడువేల రూపాయలు మోసపోయానంటూ కాజల్ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు.అలా ఆన్ లైన్ మోసం బారిన పడిన సమయం నాన్న తనపై సీరియస్ అయ్యారని కాజల్ పేర్కొన్నారు.ఆ తరువాత కూడా అలాంటి ఘటనలు ఎదురయ్యాయని కాజల్ తెలిపారు.

ముంబైకు చెందినఅక్కాతమ్ముళ్లు అమెరికాలో చేసిన స్కామ్ కు సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కింది.

భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మోసగాళ్లు సక్సెస్ ను ఇస్తుందని మంచి విష్ణు భావిస్తున్నారు.19వ తేదీన విడుదల కాబోతున్న ఈ సినిమా కమర్షియల్ గా ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాల్సి ఉంది.ఈ సినిమాకు పోటీగా కార్తికేయ చావుకబురు చల్లగా, ఆది శశి సినిమాలు విడుదలవుతున్నాయి.

ముగ్గురు ఫ్లాప్ హీరోలు ఈ నెల 19వ తేదీన సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube