పెళ్లైతే పని చేయకూడదా.. కాజల్ సంచలన వ్యాఖ్యలు..?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు, యాంకర్లు పెళ్లి చేసుకుంటే అవకాశాలు తగ్గుతాయని ఇండస్ట్రీలో ఉండేవాళ్లతో పాటు ఆయా హీరోయిన్ల, యాంకర్ల ఫ్యాన్స్ భావిస్తారు.అయితే కొందరు హీరోయిన్లు మాత్రం పెళ్లి తరువాత కూడా వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఆ సెంటిమెంట్ నిజం కాదని ప్రూవ్ చేస్తున్నారు.

 Kajal Agarwal Says Marital Status Has Nothing Do Ones Career, Kajal Agarwal, Gow-TeluguStop.com

అలా అవకాశాలను అందిపుచ్చుకుంటున్న హీరోయిన్లలో కాజల్ అగర్వాల్, సమంత ఉన్నారు.

గతేడాది అక్టోబర్ 30వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును వివాహం చేసుకున్న కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరంజీవితో ఆచార్య, ప్రభుదేవాతో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు.

కాజల్ నటించిన లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ డిస్నీ + హాట్ స్టార్ లో నిన్నటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో భాగంగా మాట్లాడిన కాజల్ పెళ్లి, వృత్తికి సంబంధం ఏమిటని అది పర్సనల్, ఇది ప్రొఫెషనల్ అంటూ కామెంట్లు చేశారు.

Telugu Aacharya, Busy, Chiranjeevi, Disney Hot, Gowtham Kichlu, Kajal Agarwal, M

చాలామంది యాక్టర్ కు పెళ్లైతే పెళ్లి తర్వాత కూడా పని చేస్తారా.? అని ప్రశ్నిస్తారని పెళ్లైతే పని చేయకూడదా.? పెళ్లికి, వృత్తికి సంబంధం ఏమిటి.? అని ప్రశ్నించారు.ఎవరైనా పెళ్లి తర్వాత కూడా పని చేస్తున్నారా.? అని అడిగితే తాను నటిస్తున్న సినిమాల జాబితా వాళ్లకు చెప్పాలని అనిపిస్తుందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.తాను నటించిన నాలుగైదు సినిమాలు కూడా ఈ ఏడాదే విడుదల కాబోతున్నాయని వెల్లడించారు.

హీరోహీరోయిన్లకు షూటింగ్ అయిపోతే పని అయిపోతుందని.

కానీ దర్శకులకు మాత్రం ఎంత వర్క్ ఉంటుందో ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న సమయంలోనే అర్థమైందని వెల్లడించారు.పెళ్లి తర్వాత లైఫ్ చాలా అద్భుతంగా మారిందంటూ కాజల్ అగర్వాల్ చెప్పుకొఛారు.

గౌతమ్ అప్పుడప్పుడూ సెట్ కు వస్తుంటారని సెట్ లో ఉన్నవారంతా గౌతమ్ ను కుటుంబ సభ్యుడిలా చూసుకుంటున్నారని ఆమె అన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube