నా సక్సెస్ కి కారణం నా కష్టమే అంటున్న కాజల్ అగర్వాల్

ఎంతో మంది అందాల భామలు హీరోయిన్స్ గా రాణించాలని, స్టార్ హీరోయిన్స్ గా ఎదగాలని అనుకుంటారు.అయితే ఆ అవకాశం అతికొద్ది మందికి మాత్రమే వస్తుంది.

 Kajal Agarwal Said My Success Depends On My Hard Work, Tollywood, Star Heroines,-TeluguStop.com

స్టార్ హీరోయిన్స్ గా గుర్తింపు తెచ్చుకుంటూ కెరియర్ ని కూడా ఎక్కువ కాలం కొనసాగేలా చేసుకునే అవకాశం ఇంకా తక్కువ మందికి వస్తుంది.అలాంటి హీరోయిన్స్ లో ఈ తరంలో కనిపించే అందాల భామ కాజల్ అగర్వాల్.

తన అందం, అభినయంతో ఏకంగా 13 ఏళ్ల సుదీర్ఘ సినిమా కెరియర్ ని కొనసాగించిన ఈ అందాల భామ ఇప్పటికి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది.మెగాస్టార్ లాంటి స్టార్ హీరోతో ప్రస్తుతం జత కడుతుంది.

ఇలా సీనియర్స్, జూనియర్స్ తో కలిసి నటించే అవకాశం వచ్చిన హీరోయిన్స్ లలో కాజల్ కూడా ఒకరు.అయితే సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్స్ అవ్వాలంటే అందం, అభినయంతో పాటు కాస్తా అదృష్టం కూడా ఉండాలని చాలా మంది అంటూ ఉంటారు.

అయితే ఈ విషయంలో కాజల్ అగర్వాల్ అదృష్టం అనే మాటకి అస్సలు ప్రాధాన్యత ఇవ్వడం లేదు.

సినిమాల్లో స్టార్ డమ్ రావడానికి కేవలం అదృష్టం ఒకటే అంటే ఒప్ప్పుకొను అంటుంది కాజల్ అగర్వాల్.

కృషి, పట్టుదల లేకుండా వచ్చిన ఏ విజయమైనా సంతృప్తి ఉండదు.అందుకే ఎవరైనా వచ్చి అదృష్టం ఒక్కటే విజయానికి మార్గం అంటూ చెప్పే కబుర్లు నమ్మొద్దు అని కాజల్ సూచిస్తుంది.

సినిమాల్లోకి వచ్చాక అదృష్టం అనే మాటకి ఎంత విలువనిస్తారు అని చాలా మంది అడుగుతూ ఉంటారు.నిజం చెప్పాలంటే నా సినిమా కెరీర్‌లో అదృష్టం అనే పదానికి చోటు ఉండి ఉండొచ్చు.

కానీ నా స్టార్ డమ్ మొత్తం అదృష్టం మీదే వచ్చింది అంటే నేను నమ్మను.అలాగే నేను ఒప్పుకోను.

సినిమా అవకాశాలు రావడం అదృష్టం వల్ల కావొచ్చేమో కానీ.తర్వాత కెరీర్‌లో నేను టాప్ పొజిషన్‌కి చేరిన క్రమం మొత్తం నా కష్టమే అని చెబుతుంది.

ఒక సినిమాలో మనం అద్బుతంగా నటించాం అనిపిస్తేనే నిర్మాతలు, దర్శకులు తమ సినిమాలోని పాత్రలకి నేను సరిపోతా అని ఎంపిక చేసుకుంటారు అని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.మొత్తానికి అదృష్టం కంటే తన సక్సెస్ కి కారణం తన కష్టమే అని అమ్మడు క్లారిటీగా చెబుతుంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube