ఆ పని వల్ల విశ్రాంతిగా ఉందంటున్న కాజల్ అగర్వాల్!

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అందరికీ తెలిసిందే.సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు ఇంటికే పరిమితమయ్యారు.

 Kajal Agarwal Reveals Her Recent Habit And Said Its Help Her To Relax-TeluguStop.com

రోజుకు లక్షల సంఖ్యలో వైరస్ కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.ఇక సినీ ఇండస్ట్రీలో మొత్తం సినిమాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎంతోమంది నటీనటులు, దర్శక నిర్మాతలు, సినీ బృందాలు కరోనా బారిన పడగా.సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి ఇంటి పట్టునే ఉంటున్నారు.

 Kajal Agarwal Reveals Her Recent Habit And Said Its Help Her To Relax-ఆ పని వల్ల విశ్రాంతిగా ఉందంటున్న కాజల్ అగర్వాల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక కొందరు సెలబ్రెటీలు కరోనా బాధితులకు తమకు తోచినంత సహాయాన్ని అందిస్తున్నారు.అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పలు జాగ్రత్తలు తెలుపుతున్నారు.

ఇదిలా ఉంటే టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ కాజల్ అగర్వాల్ కూడా తను తన సినిమా షూటింగ్ లకు బ్రేక్ ఇచ్చి తను కూడా ఇంటి పట్టునే ఉంటుంది.

ప్రస్తుతం ఆమె ఆచార్య సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అంతేకాకుండా పలు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల సినిమాలకు వాయిదా పడగా తిరిగి ముంబై కి వెళ్ళిపోయింది.

ఇక తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్ట్ చేయగా.అందులో తను ఓ కొత్త అలవాటు నేర్చుకున్నట్లు కనిపిస్తుంది.ప్రస్తుతం దాని గురించి కాజల్ తెలుపుతూ.ఇప్పుడున్న పరిస్థితులు భయంకరంగా ఉన్నాయని, ఇలాంటి క్లిష్ట సమయంలో మన మనసులు దేనిమీదైనా దృష్టిపెట్టడం ముఖ్యమని, అది ఏ విధంగా అయినా సరే మంచి అనుభూతి పొందవచ్చు అని తెలిపింది.

కాబట్టి తను కూడా అదే చేస్తున్నానంటూ.అల్లడం వంటి పని మొదలు పెట్టాను అని తెలిపింది.

దీని వల్ల తనకు విశ్రాంతి, మానసిక ఉల్లాసం కలుగుతుందని తెలిపింది.ప్రస్తుతం తను అల్లిన ఓ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

#KajalAgarwal #Relaxing #Kajal Habit #Aacharya #Kajal Aggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు