బిగ్‌ బాస్‌ విన్నర్‌లకు కాజల్‌కు ఒక రిలేషన్‌ ఉంది.. ఆ రిలేషన్‌ ఏంటో తెలుసా?

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 2 విజయవంతంగా పూర్తి అయ్యింది.మొదటి సీజన్‌లో శివబాలాజీ విజేతగా నిలవగా, ఈ సీజన్‌లో మాత్రం అంతా అనుకున్నట్లుగా కౌశల్‌ గెలిచేశాడు.

 Kajal Agarwal Relation With Bigg Boss Telugu Winners-TeluguStop.com

శివబాలాజీ విజయం సాధిస్తాడని జనాలు పెద్దగా ఊహించలేదు.కాని కౌశల్‌ విజేత అంటూ షో ప్రారంభం అయిన మూడవ, నాల్గవ వారంలోనే తేలిపోయింది.

తెలుగు బిగ్‌ బాస్‌ రెండు సీజన్‌లలో విజేతలుగా నిలిచిన శివ బాలాజీ మరియు కౌశల్‌ లకు ఒక పోలిక ఉంది అంటూ సోషల్‌ మీడియాలో మీమ్స్‌ తెగ హల్‌ చల్‌ చేస్తున్నాయి.ఆ పోలిక తెలుగు స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌.

అవును వీరిద్దరికి కాజల్‌కు సినిమాల ద్వారా రిలేషన్‌ ఉంది.చందమామ సినిమాలో కాజల్‌తో పాటు శివబాలాజీ నటించిన విషయం తెల్సిందే.ఆ సినిమాలో కాజల్‌కు శివబాలాజీ బావ వరుస అవుతాడు.ఇక ప్రభాస్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌’ చిత్రంలో కాజల్‌కు బావగా కౌశల్‌ నటించాడు.కౌశల్‌కు కాస్త పాత్ర తక్కువ ఉన్నా కూడా మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌లో మంచి పాత్రను ఆయన దక్కించుకున్నాడు.కీలకమైన సీన్స్‌లో కౌశల్‌ ఆ సినిమాలో కనిపిస్తాడు.

కాజల్‌కు బావగా కౌశల్‌ ఆ చిత్రంలో కనిపించి అలరించాడు.ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయాలను దక్కించుకున్నాయి అనే విషయం తెల్సిందే.

తెలుగు బిగ్‌ బాస్‌ రెండు సీజన్‌లను ప్రారంభించుకుని, రెండు సీజన్‌ల విన్నర్స్‌ కూడా కాజల్‌ బావలు అవ్వడంతో సోషల్‌ మీడియాలో మీమ్స్‌కు కొదవ లేకుండా పోయింది.కాజల్‌కు బావ అయితే బిగ్‌ బాస్‌ సీజన్‌ విన్నర్‌ అయిపోవచ్చు అంటూ ప్రచారం జరుగుతుంది.బిగ్‌ బాస్‌ సీజన్‌ 3లో కూడా కాజల్‌ బావ ఎవరో ఒకరు ఉండే అవకాశం ఉంది.ఆ వ్యక్తే గెలుస్తాడని అంతా కూడా సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

మొత్తానికి కాజల్‌ను ఇలా బుక్‌ చేసి జోకులు పేల్చుతున్నారు.ఈ విషయమై కాజల్‌ ఎలా రియాక్ట్‌ అవుతుందో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube