ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న కాజల్...  

Kajal Agarwal Reaction About Bharateeyudu 2 Shooting Accident -

ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ విలక్షణ నటుడు కమల్ హాసన్ నడుస్తున్న టువంటి భారతీయుడు 2 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.అయితే ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.

 Kajal Agarwal Reaction About Bharateeyudu 2 Shooting Accident - -Latest News-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా ఈ చిత్రం ఈ చిత్రానికి సంబంధించి నటువంటి ఇ ఓ కీలక సన్నివేశం చిత్రీకరణ జరుగుతుండగా భారీ ప్రమాదం చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయి ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు.

ఇందులో ఇద్దరు వ్యక్తులు ఈ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తుండగా మరో వ్యక్తి లైట్ బాయ్ గా పని చేస్తున్నాడు.ఈ ప్రమాదం ఒక్కసారిగా కోలీవుడ్ సినీ పరిశ్రమలో కలకలం రేపింది.

అంతేగాక ఈ ప్రమాదం జరిగిన సమయంలో కాజల్ అగర్వాల్ అక్కడే ఉన్నారు.దీంతో ఈ ఘటనపై ఆమె తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించింది.ఇందులో షూటింగ్ సమయంలో భాగంగా ఇలా జరుగుతుందని అనుకోలేదని చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు బాధ వర్ణనాతీతం అని అన్నారు.అలాగే ప్రమాదంలో గాయపడి న భక్తులు తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

ఏదేమైనప్పటికీ ఇలాంటి భారీ బడ్జెట్ చిత్రం చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం తనను తీవ్రంగా కలచి వేసిందని అన్నారు.విషయం ఇలా ఉండగా కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మోసగాళ్లు, ముంబై సాగా అనే రెండు చిత్రాల్లో కూడా నటిస్తోంది.

తాజా వార్తలు