టాలీవుడ్ స్టార్ యాంకర్ ని డేట్ కి రమ్మన్న కాజల్...  

Kajal Agarwal Reaction About Anchor Pradeep Date Request - Telugu Anchor Pardeep News, Kajal Agarwal, Kajal Agarwal Actress, Kajal Agarwal News, Pardeep Machiraju News, Tollywood

టాలీవుడ్ లో నిత్యం పలురకాల షోలతో బిజీ బిజీగా గడుపుతున్నటువంటి టాలీవుడ్ మేల్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు అంటే ఈ మధ్యకాలంలో టక్కున గుర్తుకు వచ్చేది “నీలి నీలి ఆకాశం” అనే పాట.అయితే ప్రస్తుతం ప్రదీప్ “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Kajal Agarwal Reaction About Anchor Pradeep Date Request - Telugu Anchor Pardeep News, Kajal Agarwal, Kajal Agarwal Actress, Kajal Agarwal News, Pardeep Machiraju News, Tollywood-Latest News-Telugu Tollywood Photo Image

ఈ చిత్రంలో హీరోగా ప్రదీప్ నటిస్తుండగా అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తోంది.అయితే ఈ చిత్రానికి నూతన దర్శకుడు మున్న దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ సినీ నిర్మాత ఎస్వి బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

అయితే తాజాగా ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ప్రదీప్ ఓ ప్రముఖ ఛానల్ నిర్వహించినటువంటి ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.ఇందులో భాగంగా ఈ చిత్ర విశేషాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ఇంటర్వ్యూ చేసేటువంటి యాంకర్ మీకు సడన్ గా టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ నుంచి డేట్ రిక్వెస్ట్ వస్తే ఏం చేస్తారని అడిగింది.దీంతో ప్రదీప్ సరదాగా సమాధానమిచ్చా డు.ముందు తనను తాను ఒక సారి గిల్లుకొని అసలు కలా నిజమా అని చెక్ చేసుకుంటానని అన్నారు.ఆ తర్వాత ఒకవేళ నిజమే అయినా నాతో జోక్ చేయకండి మేడం అని అంటానని అన్నారు.

దీంతో అక్కడున్నవారంతా సరదాగా నవ్వారు.

అయితే ఈ విషయంపై తాజాగా కాజల్ అగర్వాల్ స్పందించింది.ఇందులో భాగంగా “ప్రదీప్ ఇలాంటి టిపికల్ క్వశ్చన్ కి క్రియేటివ్ ఆన్సర్ ఆలోచించి చెప్పు.మరియు నీ సినిమాకి ఆల్ ద బెస్ట్” అంటూ రిప్లై ఇచ్చింది.

అయితే ఈ విషయం ప్రస్తుతం నెట్టింట్లో బాగానే ట్రోల్ అవుతోంది.అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించినటువంటి పాటలు విడుదలై మంచి ప్రేక్షకాదరణ పొందాయి.

దీంతో ప్రదీప్ కూడా ఈ చిత్రంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు.అయితే యాంకరింగ్ లో తనదైన శైలిలో ఆకట్టుకునేటువంటి ప్రదీప్ మరి 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్రంతో ఎలా ఆకట్టుకుంటాడా చూడాలి.

తాజా వార్తలు

Kajal Agarwal Reaction About Anchor Pradeep Date Request-kajal Agarwal,kajal Agarwal Actress,kajal Agarwal News,pardeep Machiraju News,tollywood Related....