వామ్మో.. కాజల్ అలాంటి పాత్రలో నటించబోతుందా..?

సినిమా రంగంలో 15 సంవత్సరాలు హీరోయిన్ గా కొనసాగాలంటే అందం, అభినయంతో పాటు అదృష్టం కూడా ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది.అలా ప్రతిభ, అదృష్టంతో అవకాశాలు సంపాదించుకుంటున్నారు కాజల్ అగర్వాల్.

 Actress Kajal Agarwal Playing Raw Agent Role In Nagarjuna Movie, Kajal Agarwal,-TeluguStop.com

సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో నటించడంతో పాటు హీరోలకు అక్క తరహా పాత్రల్లో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పెళ్లి తరువాత కూడా కాజల్ హీరోయిన్ గా సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు.

తాజాగా కాజల్, నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు అధికారిక ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.

నాగార్జున వైల్డ్ డాగ్ సినిమా వచ్చే నెలలో విడుదల కానుండగా నాగార్జున బంగార్రాజు సినిమా షూటింగ్ తో పాటు ప్రవీణ్ సత్తారు మూవీ షూటింగ్ లో పాల్గొంటూ ఉండటం గమనార్హం.అయితే ఈ సినిమాలో కాజల్ పాత్రకు సంబంధించి ఒక వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Telugu Bangarraju, Kajal Agarwal, Marshal, Nagarjuna Kajal, Nagarjuna, Praveen S

కాజల్ ఇప్పటికే నాగార్జున సినిమాలో స్పెషల్ రోల్ లో నటిస్తున్నానని ఇప్పటివరకు తాను అలాంటి పాత్రలో నటించలేదని చెప్పిన సంగతి తెలిసిందే.రా ఏజెంట్ పాత్ర కొరకు కాజల్ అగర్వాల్ ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోనున్నారని సమాచారం.నాగార్జున కాజల్ అగర్వాల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా కూడా ఇదే కావడం గమనార్హం.కాజల్ పెళ్లి తరువాత ప్రయోగాత్మక పాత్రలను ఎంపిక చేసుకుంటూ ఉండటం గమనార్హం.

కాజల్ అగర్వాల్ ఈ పాత్ర కోసం మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నారు.ట్రైనింగ్ పూర్తైన తరువాతే కాజల్ అగర్వాల్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు.

ఆయుధాలు పట్టుకోవడంతో పాటు ఇతర అంశాలకు సంబంధించి కూడా కాజల్ అగర్వాల్ శిక్షణ తీసుకోనున్నారని తెలుస్తోంది.మోసగాళ్లు సినిమాతో సక్సెస్ ను ఖాతాలో వేసుకున్న కాజల్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తారేమో చూడాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube