నాగార్జున సినిమాలో అలాంటి పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్న కాజల్ అగర్వాల్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగార్జున ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం ప్లాన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.హిందీలో హిట్ అయిన రేస్ రీమేక్ గా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారనే టాక్ ఉంది.

 Kajal Agarwal To Play Raw Agent Role In Praveen Sattaru Nagarjuna Movie, Tollywo-TeluguStop.com

ఇదిలా ఉంటే నాగార్జున కెరియర్ లో భారీ బడ్జెట్ తో యాక్షన్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమాలో కింగ్ నాగార్జునకి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది.గోవాలో ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేసుకొని సెకండ్ షెడ్యూల్ కి దర్శకుడు రెడీ అవుతున్నాడు.

అయితే కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తుంది.ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పాత్ర గురించి ఓ హాట్ న్యూస్ ఫిలిం నగర్ లో చక్కర్లు కొడుతుంది.

ఇందులో కాజల్‌ అగర్వాల్‌ ‘రా’ ఏజెంట్‌గా శక్తివంతమైన పాత్రను పోషిస్తోందట.దేశ రక్షణ కోసం ఎంతటి సాహసానికైనా సిద్ధపడే ధీశాలి అయిన మహిళగా ఆమె పాత్ర స్ఫూర్తివంతంగా సాగుతుందని చెబుతున్నారు.

ఎంతటి భావోద్వేగాలనైనా తనలోనే అణచుకుంటూ దేశభక్తితో వృత్తినే దైవంగా భావించే గూఢచారి పాత్రలో ఆమె నటన సినిమాలో ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు.ఇప్పటి వరకు రెగ్యులర్ కమర్షియల్ హీరోయిన్ పాత్రలకి పరిమితం అయిన కాజల్ కెరియర్ లో గుర్తుండిపోయే స్థాయిలో ఆమె పాత్ర ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఏది మరి ఇలాంటి పవర్ ఫుల్ పాత్రలో ఈ చందమామ ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనేది వేచి చూడాలి.ఇదిలా ఉంటే మరో వైపు మెగాస్టార్ చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో కూడా కాజల్ అగర్వాల్ ఆసక్తికరమైన పాత్రలో కనిపించాబోతుందని వినికిడి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube