పవన్ కళ్యాణ్ కి జోడీగా తెరపైకి కాజల్ అగర్వాల్ పేరు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలు చేస్తూనే మరో వైపు సినిమాలు కూడా చేస్తున్నాడు.ఈ సారి ఏకంగా పవన్ కళ్యాణ్ వరుసగా నాలుగు సినిమాలు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

 Kajal Agarwal Once Again Romance With Pawan Kalyan, Director Surendar Reddy, Vak-TeluguStop.com

రాజకీయాలలోకి రాకముందు ఏడాదికి కనీసం ఒక్క సినిమా కూడా చేయడానికి ఆలోచించే పవన్ ఇప్పుడు మాత్రం గ్యాప్ లేకుండా సినిమాలు చేసేందుకు సిద్ధమయ్యాడు.జనసేన పార్టీని నడపాలంటే పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫైనాన్సియల్ సోర్స్ కేవలం సినిమాలు మాత్రమే.

అందుకే ఇష్టం లేకున్నా తప్పక చేస్తున్నాడు.ఇక పవన్ చేస్తున్న సినిమాలలో ప్రస్తుతం వకీల్ సాబ్ మూవీ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

త్వరలో దీని పెండింగ్ షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇక దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో పీరియాడికల్ యాక్షన్ మూవీ ఒకటి చేయబోతున్నాడు.

ఈ సినిమా తర్వాత హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి సినిమాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాలలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ఎవరు నటించబోతున్నారు అనే ఆసక్తి ఫ్యాన్స్ లో నెలకొంది.

ఈ నేపధ్యంలో హరీష్ శంకర్ సినిమాలో పూజా హెగ్డే, కీర్తి సురేష్ లలో ఒకరు కన్ఫర్మ్ అనే మాట వినిపిస్తుంది.ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ ని పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.

గతంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కాజల్ అగర్వాల్ తో రొమాన్స్ చేశాడు.అందులో వారిద్దరి రొమాంటిక్ కెమిస్ట్రీ బాగున్నా సినిమా సక్సెస్ కాకపోవడం వలన పెద్దగా ఎవరి దృష్టి పడలేదు.

అయినా కూడా సురేందర్ రెడ్డి కాజల్ అగర్వాల్ ని హీరోయిన్ గా ఫైనల్ చేయడానికే ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది.అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే సరికి మరో ఏడాదికి పైగానే సమయం పడుతుంది కాబట్టి ఇప్పట్లో ప్రకటించే అవకాశం ఉండకపోవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube