కాజల్‌ కు బిగ్గెస్ట్‌ ఆఫర్‌.. మళ్లీ స్టార్‌ హీరోయిన్‌   Kajal Agarwal Next With Director Shankar     2018-11-05   11:28:08  IST  Ramesh P

దశాబ్దం కాలంగా టాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలుగుతూనే ఉన్న కాజల్‌ ఈమద్య కాలంలో కాస్త ఫేడ్‌ ఔట్‌ అవుతున్నట్లుగా అనిపిస్తోంది. పెద్ద ఎత్తున ఈమెకు ఆఫర్లు రావడం లేదు. అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా చిన్న హీరోల సినిమాల్లో కూడా నటిస్తూ తన క్రేజ్‌ను కాపాడుకుంటూ వస్తుంది. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌తో కలిసి తేజ దర్శకత్వంలో ఒక చిత్రాన్ని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఆ చిత్రంతో పాటు ఇంకా రెండు మూడు చిన్న చిత్రాల్లో కూడా నటించబోతుంది. తమిళంలో ఈమెకు మంచి ఆఫర్లు దక్కుతున్నాయి.

తమిళ సినీ వర్గాల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కాజల్‌ కు కెరీర్‌ లోనే మరో బిగ్గెస్ట్‌ ఆఫర్‌ దక్కబోతుందట. యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌, ది లెజెండ్‌ డైరెక్టర్‌ శంకర్‌ల కాంబినేషన్‌ లో తెరకెక్కబోతున్న ‘భారతీయుడు 2’ చిత్రంలో ఈమెకు ఆఫర్‌ దక్కబోతుందట. కమల్‌కు జోడీగా కాజల్‌ అయితేనే కరెక్ట్‌ జోడీ అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయుడు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ను శంకర్‌ చేయిస్తున్నాడు.

Kajal Agarwal Next With Director Shankar-

త్వరలోనే 2.ఓ చిత్రం విడుదల కాబోతుంది. ఆ చిత్రం విడుదల అయిన నెల గ్యాప్‌ లోనే భారీ అంచనాల నడుమ భారతీయుడు 2 చిత్రం విడుదల కాబోతుంది. ప్రస్తుతం హీరోయిన్‌ ఆడిషన్స్‌ జరుగుతున్నాయని, కాజల్‌ దాదాపుగా ఫైనల్‌ అయినట్లే అంటూ వార్తలు వస్తున్నాయి. శంకర్‌ దర్శకత్వంలో సినిమా అంటే అది హాలీవుడ్‌ రేంజ్‌ లో ఉంటుంది. అందుకే కాజల్‌ కళ్లు మూసుకుని ఓకే చెప్పేసినట్లుగా సమాచారం అందుతుంది. ఇది కాజల్‌కు మళ్లీ స్టార్‌ హీరోయిన్‌ క్రేజ్‌ను తీసుకు రావడం ఖాయం. ఈ ఆఫర్‌తో మరో అయిదు సంవత్సరాల పాటు కెరీర్‌ సాఫీగా సాగిపోతుందనే నమ్మకం అంతా వ్యక్తం చేస్తున్నారు.