సౌత్‌ పై అభిమానంను ఇలా చూపించబోతున్న కాజల్‌  

kajal aggarwal marriage reception in Hyderabad ,kajal aggarwal, kajal aggarwal marriage, gautham kitchlu, kajal aggarwal wedding reception, hyderabad, web series - Telugu Gautham Kitchlu, Hyderabad, Kajal Aggarwal, Kajal Aggarwal Marriage, Kajal Aggarwal Marriage Reception In Hyderabad, Kajal Aggarwal Wedding Reception, Kajal Marriage News, Kajal News, Telugu Heroine, Web Series

కాజల్‌ అగర్వాల్‌ నేడు గౌతమ్‌ ను పెళ్లాడింది.ఆమె వివాహంకు కేవలం వంద మంది బంధు మిత్రులు మాత్రమే హాజరు అయ్యారు.

TeluguStop.com - Kajal Agarwal Marriage Reception In Hyderabad

గత మూడు నాలుగు రోజులుగా ఆమె పెళ్లికి సంబంధించిన హడావుడి సోషల్‌ మీడియాలో కనిపిస్తుంది.నేడు కూడా పెళ్లి ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

పెళ్లి ఫొటోలను కాజల్‌ సన్నిహితులు రెగ్యులర్‌ గా షేర్‌ చేస్తున్నారు.ఇక సౌత్‌ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకున్న కాజల్‌ అగర్వాల్‌ సౌత్‌ నుండి పెళ్లికి ఏ ఒక్కరిని కరోనా కారణంగా పిలవలేక పోయింది.

TeluguStop.com - సౌత్‌ పై అభిమానంను ఇలా చూపించబోతున్న కాజల్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అందుకే హైదరాబాద్‌ లో పెళ్లి తర్వాత పార్టీ ఏర్పాటు చేయాలని భావించింది.తమిళం మరియు తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన వారు ఆ పార్టీలో హాజరు అవ్వబోతున్నారు.

తమిళనాడు నుండి ఎక్కువ సంఖ్యలో సభ్యులు వచ్చేది ఉంటే మరో రోజు చెన్నైలో కూడా పార్టీ ఏర్పాటు చేసే అవకాశం ఉంది.వంద నుండి 150 మంది వరకు హాజరు అయ్యేలా హైదరాబాద్‌ లో రిసెప్షన్‌ కు ఒక ఫైవ్‌ స్టార్ హోటల్‌ను ఇప్పటికే బుక్‌ చేశారని మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.
కాజల్‌ అగర్వాల్‌ టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా పుష్కర కాలం పాటు కొనసాగింది.ఇప్పటికి కూడా స్టార్‌ హీరోయిన్‌గా వెలుగు వెలుగుతోంది.ప్రస్తుతం చిరంజీవికి జోడీగా ఆచార్య సినిమాలో నటిస్తున్న కాజల్‌ మరో వైపు మంచు విష్ణు సినిమాలో కూడా నటిస్తుంది.తెలుగు మరియు తమిళ సినిమాల్లో నటించడంతో పాటు వెబ్‌ సిరీస్‌ లు ఇతర యాడ్స్‌ లో కూడా నటిస్తూ బిజీ బిజీగా ఉండే ఈ అమ్మడు ఇప్పుడు పెళ్లితో గౌతమ్‌కు జోడీ అయ్యింది.

పెళ్లి తర్వాత కూడా సినిమా చేస్తానంటూ ఇప్పటికే చెప్పిన కాజల్‌ వచ్చే నెల రెండవ లేదా మూడవ వారంలోనే ఆచార్య షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశం ఉంది.

#Hyderabad #KajalAggarwal #Kajal Aggarwal #Gautham Kitchlu #KajalAggarwal

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Agarwal Marriage Reception In Hyderabad Related Telugu News,Photos/Pics,Images..