అదృష్టం అంటే కాజల్‌దే..!

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా తేజ దర్శకత్వంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చిన ‘లక్ష్మి కళ్యాణం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా కాజల్‌ పరిచయం అయ్యింది.మొదట ఒకటి రెండు సినిమాలు యావరేజ్‌గా నిలిచాయి.

 Kajal Agarwal Luckygirl-TeluguStop.com

ఆ తర్వాత ఈమె నటించిన ‘చందమామ’ చిత్రం ఒక అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.చందమామలో కాజల్‌ను దర్శకుడు కృష్ణవంశీ అదిరిపోయేలా చూపించి, మంచి ప్రాముఖ్యత ఉన్న పాత్రను కట్టబెట్టాడు.

దాంతో ఆమె కెరీర్‌ టర్న్‌ అయ్యింది.హీరోయిన్‌గా నిలదొక్కుకున్న సమయంలోనే ఈ అమ్మడికి రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన నటించే అవకాశం రావడం, ఆ సినిమా సూపర్‌ హిట్‌ అవ్వడంతో స్టార్‌ హీరోయిన్‌ అయ్యింది.

‘మగధీర’ చిత్రం తర్వాత దాదాపు దశాబ్ద కాలం పాటు ఆమె వెనుదిరిగి చూసింది లేదు.చేసిన ప్రతి సినిమా కూడా విజయాన్ని సొంతం చేసుకోవడంతో స్టార్‌ హీరోలు ఆమెను కోరుకున్నారు.పది సంవత్సరాల పాటు వరుసగా స్టార్‌ హీరోలతో మాత్రమే నటించి రికార్డు సృష్టించింది.

ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్‌లో అతి కొద్ది మంది మాత్రమే అందరు స్టార్‌ హీరోలతో నటించారు.

అందులో కాజల్‌ ఒకరు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.ఇక ఎంతటి హీరోయిన్‌కు అయినా కూడా కొంత కాలం తర్వాత ఛాన్స్‌ లేక కష్టాలు తప్పవు.

ముఖ్యంగా ఈమద్య కాలంలో వస్తున్న హీరోయిన్స్‌ రెండు మూడు సంవత్సరాలు, మా అంటే అయిదు సంవత్సరాల కంటే ఎక్కువగా హీరోయిన్‌గా కొనసాగలేక పోతున్నారు.కాని కాజల్‌ మాత్రం అదృష్టం కొద్ది అవకాశాలను దక్కించుకుంటూనే ఉంది.

నాలుగు సంవత్సరాల క్రితమే కాజల్‌ పనైపోయిందని, తెలుగులో ఈమెకు ఇక ఆఫర్లు రావని, తమిళంలో ఒకటి రెండు సినిమాలు చేసి, ఆ తర్వాత హీరోయిన్‌గా సినిమాలు మానేస్తుందని అంతా భావించారు.తెలుగులో దాదాపు సంవత్సరం పాటు ఈమెకు ఛాన్స్‌లు రాలేదు.

అయినా కూడా ఏమాత్రం నిరాశ చెందకుండా, చిన్న హీరోలతో కమిట్‌ కాకుండా స్టార్స్‌తోనే చేస్తానంటూ పట్టుబట్టి, అవకాశాలు దక్కించుకుంది.వరుసగా ఆ తర్వాత కూడా సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

ఇప్పుడు కూడా ఈ అమ్మడు స్టార్‌ హీరోయిన్స్‌కు వాంటెడ్‌ హీరోయిన్‌గా పేరు సంపాదించింది.తెలుగులో ఈ అమ్మడు ప్రస్తుతం చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా ప్రాముఖ్యత ఉన్న పాత్రలన్నింటిని చేస్తోంది.

కాజల్‌తో నటించేందుకు ప్రస్తుతం యంగ్‌ హీరోలు ఉత్సాహంగా ఉన్నారు.దాంతో ఈమె ప్రాముఖ్యత ఉన్న పాత్ర అయితే వారితో నటించేందుకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పడంతో రెండు మూడు సినిమాల ఆఫర్లు ఈమె తలుపు తట్టాయి.

మరో వైపు తమిళంలో కూడా అమ్మడికి అవకాశాలు వస్తూనే ఉన్నాయి.సినిమా పరిశ్రమలో ఎంట్రీ ఇచ్చి దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా భారీ స్థాయిలో ఆఫర్లు దక్కించుకుంటున్న కాజల్‌ను చూసి ఇతర హీరోయిన్స్‌ ముక్కున వేలేసుకుంటున్నారు.

అదృష్టం అంటే కాజల్‌దే అంటూ అందరు అభినందిస్తున్నారు.కాజల్‌ ఎంట్రీ ఇచ్చిన చాలా ఏళ్లకు సినిమా పరిశ్రమలోకి వచ్చిన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఆమద్య స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని, ప్రస్తుతం ఆఫర్ల కోసం అర్రులు చాస్తున్న విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube