త్వరలో ముఖ్యమైన ప్రకటన.. కాజల్ ఏం షాక్ ఇస్తుంది..!

సౌత్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో తన స్నేహితులు గౌతం కిచ్లుని పెళ్లాడిన విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తున్న కాజల్ కొత్త సినిమాలకు సైన్ చేయట్లేదని లేటెస్ట్ టాక్.

 Kajal Agarwal Important Announcement Soon , Gautham Kichlu, Kajal, Kajal Agarwal-TeluguStop.com

అంతేకాదు నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న ది ఘోస్ట్ సినిమా నుండి కాజల్ తప్పుకుందని అంటున్నారు.అయితే కాజల్ ప్రెగ్నెన్సీ వల్లే సినిమాలను ఆపేసిందని అంటున్నారు.

అయితే దీనిపై అఫీషియల్ కన్ ఫర్మేషన్ రాలేదు.

ఇదిలాఉంటే లేటెస్ట్ గా కాజల్ తన ఇన్ స్టాగ్రాం స్టోరీ లో త్వరలో ముఖ్యమైన ప్రకటన వస్తుంది.

వేచి చూడండని చెప్పింది.ఇంతకీ కాజల్ చేసే ఆ ముఖ్యమైన ప్రకటన ఏంటన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో డిస్కషన్ మొదలైంది.

ప్రస్తుతం కాజల్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుంది.ఆల్రెడీ చిరుతో ఖైదీ నెంబర్ 150లో నటించిన కాజల్ మళ్లీ ఆచార్య సినిమాలో జోడీ కడుతుంది.

కాజల్ చెప్పే న్యూస్ ఏంటి.కాజల్ నిజంగానే గుడ్ న్యూస్ చెప్పబోతుందా లేదంటే కాజల్ చెప్పే వార్త ఏంటన్నది ఆమె ఫ్యాన్స్ లో స్పెషల్ డిస్కషన్ అయ్యింది.

 అయితే కాజల్ ఒకవేళ సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టే ఉద్దేశంతో ఏదైనా ఎనౌన్స్ మెంట్ చేస్తుందా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.ఏది ఏమైనా కాజల్ చేసే ఎనౌన్స్ మెంట్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube