ఛార్మి సినిమాను లాక్కున్న కాజల్ అగర్వాల్.. కానీ అనుకోని రీతిలో అది కూడా?

Kajal Agarwal Hits Charmi Movie But Unexpectedly It Too

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిన్న హీరోలు, స్టార్ హీరోలు అని తేడా లేకుండా అందరితో నటిస్తూ మంచి క్రేజ్ సంపాదించుకుంటున్న బ్యూటీ కాజల్ అగర్వాల్.అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

 Kajal Agarwal Hits Charmi Movie But Unexpectedly It Too-TeluguStop.com

తన అందంతో ఎంతో మంది కుర్రాళ్ళు హృదయాలను దోచుకుంది.విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సొంతం చేసుకుంది.

ఇదిలా ఉంటే ఈ అమ్మడు మరో నటి సినిమాను లాక్కుందట.

 Kajal Agarwal Hits Charmi Movie But Unexpectedly It Too-ఛార్మి సినిమాను లాక్కున్న కాజల్ అగర్వాల్.. కానీ అనుకోని రీతిలో అది కూడా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ అమ్మడు టాలీవుడ్ ఇండస్ట్రీకి లక్ష్మీకళ్యాణం సినిమాతో పరిచయమయ్యింది.

ఇక ఈ సినిమా కొంతవరకు మంచి గుర్తింపునిచ్చింది.ఆ తర్వాత చందమామ సినిమాలో నటించగా అది కూడా మంచి సక్సెస్ గా నిలిచింది.

ఇక టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటించిన మగధీర సినిమాలో నటించి ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ నే సొంతం చేసుకుంది.

Telugu Charmi Movie, Film Industry, Heroine, Kajal, Tollywood, Unexpectedly-Movie

ఈ సినిమాతోనే స్టార్ హోదా ను సంపాదించుకుంది.ఆ తర్వాత వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.స్టార్ హీరోల సినిమాలలో కూడా నటించింది.

ఇక చిరంజీవి సరసన నటించాక ఈ అమ్మడి క్రేజ్ మరింత పెరిగిపోయింది.ప్రస్తుతం పలు సినిమాలలో బాగా బిజీగా ఉంది.

కేవలం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.ఇదిలా ఉంటే గతంలో కాజల్ అగర్వాల్ మరో నటి ఛార్మి సినిమాను లాక్కుంది.

ఇంతకూ అసలు ఏం జరిగిందంటే.కెరీర్ మొదట్లో మగధీర సినిమాతో మంచి క్రేజ్ సంపాదించడంతో చాలా మంది దర్శక నిర్మాతలు కాజల్ కోసం బాగా ఎదురుచూశారు.

Telugu Charmi Movie, Film Industry, Heroine, Kajal, Tollywood, Unexpectedly-Movie

దీంతో అదే సమయంలో తనకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా అవకాశాలు వచ్చాయి.అయితే కోడి రామకృష్ణ తన దర్శకత్వంలో ‘దాంది’ అనే సినిమాను రూపొందించాలని అనుకున్నాడు.ఇక ఈ సినిమాను నిర్మాత ఎమ్మెస్ రాజు నిర్మించాలనుకున్నాడు.అంతేకాకుండా ఈ సినిమాను హారర్ నేపథ్యంలో చెయ్యాలనుకున్నారు.

దీంతో దర్శకనిర్మాత ఈ సినిమా కోసం మొదట ఛార్మికి అవకాశం ఇచ్చారు.కానీ అదే సమయంలో మగధీర బ్లాక్ బస్టర్ హిట్ తో ముందుకు వచ్చిన కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని అనుకున్నారు.

మొత్తానికి ఛార్మిని ఆ సినిమా నుంచి తప్పించి కాజల్ ని ఎన్నుకున్నారు.కానీ ఈ సినిమా అనుకోని రీతిలో కొన్ని అనివార్య కారణాలవల్ల ఆగిపోయింది.

Telugu Charmi Movie, Film Industry, Heroine, Kajal, Tollywood, Unexpectedly-Movie

మళ్లీ ఈ సినిమా గురించి ఆ దర్శకనిర్మాతలు ఎప్పుడు కూడా ముచ్చట తీయలేదు. అలా కెరీర్ మొదట్లోనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో కూడా అవకాశం అందుకుంది కాజల్.ఇక ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.గత ఏడాది ఈ ముద్దుగుమ్మ ఓ బిజినెస్ మెన్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.పెళ్లి తర్వాత కూడా బాగా అవకాశాలు అందుకుంది.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాలో చిరు సరసన రెండోసారి జతకట్టనుంది.

ఇక నాగార్జున తో కూడా ఓ సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది.మరోవైపు బాలీవుడ్ లో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.

#Unexpectedly #Kajal #Charmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube