కొత్త కాపురం కొత్త ఇంటి నుంచే మొదలు పెట్టబోతున్న కాజల్  

Kajal Agarwal gives a sneak peek into her new house, Tollywood, South Heroines, Mumbai, - Telugu Kajal Agarwal, Mumbai, New House, South Heroines, Tollywood

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్, టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే.అక్టోబర్ నెలాఖరున ఆమె పెళ్లి చేసుకోబోతుంది.

TeluguStop.com - Kajal Agarwal Gives A Sneak Peek Into Her New House

ఈ పెళ్ళికి సంబందించిన పనులని కూడా కాజల్ అగర్వాల్ ఇప్పటికే మొదలు పెట్టింది.తన స్నేహితుడు అయిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది.

ఆమె వివాహానికి సినిమా ఇండస్ట్రీ నుంచి అతి కొద్ది మంది సెలబ్రెటీ ప్రముఖులు మాత్రమే హాజరుకాబోతున్నారు.టాలీవుడ్ నుంచి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ పెళ్ళికి వెళ్లబోతున్నాడు.

TeluguStop.com - కొత్త కాపురం కొత్త ఇంటి నుంచే మొదలు పెట్టబోతున్న కాజల్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ పెళ్లి తర్వాత తన కొత్త కాపురం కొత్త ఇంటి నుంచే మొదలు పెట్టాలని అనుకుంటుంది.దానికి తగ్గట్లుగానే ఇప్పుడు ముంబైలో మంచి ఇల్లుని సిద్ధం చేసుకుంటున్నారు.

అప్పుడే ఈ జంట తమ కొత్త ఇంటి పనులు మొదలు పెట్టేశాయి.స్వతహాగాగా ఇంటీరియర్ డిజైనర్ అయిన గౌతమ్ తనకి కాబోయే శ్రీమతి టేస్ట్ కి తగ్గట్లు ఇంటిని ఇంటీరియర్ చేయిస్తున్నట్లు తెలుస్తుంది.

తన ఇంటికి సంబందించి ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని అభిమానులను సరదాగా అడిగింది.మొత్తానికి కొత్త కాపురానికి ముందుగానే కొత్త ఇల్లుని సిద్ధం చేస్తుకుంటుంది.ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత ఈమె కొద్ది రోజులు భర్తతో హనీమూన్ కి వెళ్లి తిరిగి వచ్చి ఆచార్య సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉందని తెలుస్తుంది.దీంతో పాటు భారతీయుడు సీక్వెల్ లో కూడా ఆమె నటించబోతుంది.

వచ్చే ఏడాది కాజల్ అగర్వాల్ మొత్తం నాలుగు సినిమాల వరకు పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది.

#South Heroines #Mumbai #Kajal Agarwal #New House

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Agarwal Gives A Sneak Peek Into Her New House Related Telugu News,Photos/Pics,Images..