చందమామ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కొన్ని కోట్ల మంది అభిమానంను చురగొంది.కోట్లాది మంది ఆమెను ఆరాధిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాజల్ అగర్వాల్ ను అభిమానించడంతో పాటు ఎంతో మంది ఆరాధిస్తుంటారు ప్రేమిస్తూ ఉంటారు.ఆమెను ఆరాధించే వారు ఆమె పెళ్లితో చాలా ఫీల్ అయ్యారు.
గౌతమ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం పట్ల ఆమె అభిమానులు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు.తమకు దక్కదు అని తెలిసి కూడా ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందని తెలిసిన సమయంలో చాలా మంది గుండెలు పగిలి పోయాయి.
కాజల్ పెళ్లి ఫోటోలు చాలా మందికి హార్ట్ బ్రేకింగ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.కాజల్ అంటేనే కుర్రకారుకు ఒక పవర్ అన్నట్లుగా ఉండేది.
ఆమె అందమైన రూపంతో పాటు మంచి మనసుతో ఎంతో మంది అభిమానంను పొందింది.
పెళ్లి ఫోటోలతో ఇప్పటికే తనతో క్రష్ లో ఉన్న వారి హృదయాలను ముక్కలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు మరోసారి తన అభిమానులు గుండె పట్టుకునేలా చేసింది.
పెళ్లి తర్వాత గౌతమ్ తో రొమాంటిక్ ఫోటో షూట్ కు ఫోజ్ ఇచ్చింది.దాంతో ఆ ఫొటోలు వైరల్ అయ్యాయి.ప్రస్తుతం నెట్టింట ఎక్కడ చూసినా కూడా కాజల్ పెళ్లి ఫోటోలు మరియు గౌతమ్ తో రొమాంటిక్ గా దిగిన ఫోటోలు కనిపిస్తున్నాయి.దాంతో ఈ అమ్మడుని అభిమానించే అభిమానులు మరోసారి బాబోయ్ అంటూ కన్నీరు ఈమోజీలు పోస్ట్ చేస్తున్నారు.
గుండెను బద్దలు కొట్టిన కాజల్ అది చాలదు అన్నట్లుగా ఇలా రొమాంటిక్ ఫోటోలను షేర్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఆమెను ప్రశ్నిస్తున్నారు.పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటిస్తానంటూ అభిమానులకు కాస్త ఊరటనిచ్చిన ఈ అమ్మడు యంగ్ హీరోలతో రొమాన్స్ కు కూడా సిద్దం అంటోంది.
పెళ్లికి ముందు ఎలా అయితే రొమాంటిక్ గా నటించిందో ఇప్పుడు కూడా అలా నటించేందుకు ఎలాంటి అభ్యంతరం లేదు అంటోంది.