ఆ ఇంటి వల్ల నిద్ర కూడా పోలేదంటున్న కాజల్..?

దాదాపు 15 సంవత్సరాల క్రితం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ కు ఏళ్లు గడుస్తున్నా అవకాశాలు తగ్గడం లేదు సరికదా అంతకంతకూ పెరుగుతున్నాయి.కెరీర్ మొదట్లో యంగ్ హీరోలతో జతకట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు సీనియర్ స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా నటిస్తున్నారు.

 Kajal Agarwal Did Not Sleep Throughout The Filming Of The Series.kajal Agrawal,l-TeluguStop.com

తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా ఆఫర్లతో బిజీగా ఉన్న కాజల్ నటించిన లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేటి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో మాట్లాడిన కాజల్ అగర్వాల్ షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ చేసిన ఇల్లు ఒక కొండపై ఉండేదని ఆ ఇల్లు ఈ సినిమా డైరెక్టర్ ఫ్రెండ్ ఇల్లు అని ఆమె అన్నారు.ఆ ఇంటికి సమీపంలో మరో ఇల్లు లేకపోవడంతో అక్కడ వాతావరణం ఎంతో భయంకరంగా ఉండేదని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చారు.

అయితే లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ కు అలాంటి ఇల్లే సరైన స్థలం కాబట్టి అక్కడే షూటింగ్ చేశామని కాజల్ అగర్వాల్ తెలిపారు.అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో తాను విపరీతంగా భయపడిపోయానని కాజల్ అగర్వాల్ అన్నారు.

షూటింగ్ అయిపోయిన తరువాత ఇంటికి వెళితే తనకు నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదని ఆమె అన్నారు.లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యే వరకు ఏరోజు సరిగ్గా నిద్రపోలేదని కాజల్ చెప్పారు.

Telugu Disney Hot, Kajal Agarwal, Uppena-Movie

తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో కూడా కాజల్ అగర్వాల్ చేతిలో సినిమాలు ఉన్నాయి.ప్రస్తుతం కాజల్ అగర్వాల్ ఆచార్య, మోసగాళ్లు సినిమాల్లో నటిస్తున్నారు.లైవ్ టెలీకాస్ట్ వెబ్ సిరీస్ కు వెంకట్ ప్రభు దర్శకత్వం వహించగా ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube