చిరంజీవి కోసం ఆ హీరోయిన్ బాగానే డిమాండ్ చేస్తుందటగా.....  

Kajal Agarwal Demanding Huje Remuneration For Megastar Chiranjeevi - Telugu Chiranjeevi Acharya Movie, Kajal Agarwal Demanding Huje Remuneration,, Kajal Agarwal Remuneration, Megastar Chiranjeevi, Megastar Chiranjeevi Acharya Movie, Megastar Chiranjeevi Movie News

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నటువంటి “ఆచార్య” అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్నాడు.

 Kajal Agarwal Demanding Huje Remuneration For Megastar Chiranjeevi

అయితే తాజాగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించే హీరోయిన్ విషయంపై పలు వార్తలు నెట్ లో వైరల్ అవుతున్నాయి.

అయితే ఇంతకీ ఆ వార్త ఏమిటంటే ఈ చిత్రాన్ని ప్రారంభించినప్పుడు దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించడానికి హీరోయిన్ గా త్రిష ని ఎంపిక చేశారు.

చిరంజీవి కోసం ఆ హీరోయిన్ బాగానే డిమాండ్ చేస్తుందటగా…..-Latest News-Telugu Tollywood Photo Image

కానీ త్రిష కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్య ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.దీంతో ప్రస్తుతం కొరటాల శివ టాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని త్రిష స్థానంలో తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

దీంతో కాజల్ ఈ చిత్రంలో నటించడం కోసం భారీగానే డిమాండ్ చేస్తోందట.అయితే ఆమె పారితోషికం బడ్జెట్ లో లేకపోవడంతో తెరపైకి పలువురు కొత్త హీరోయిన్ల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయం గురించి తెలుసుకున్న పలువురు సినీ విశ్లేషకులు అసలే కొత్త అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న కాజల్ అగర్వాల్ కి ఇప్పుడు పారితోషికం విషయంలో ఇంత బెట్టు అవసరమా  అంటున్నారు.అంతేకాక టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సరసన నటించేందుకు హీరోయిన్లు క్యూ కడతారని అలాంటిది త్రిష రూపంలో అవకాశం వెతుక్కుంటూ వచ్చినప్పుడు ఇలా చేయడం సరికాదని అంటున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటికే ఈ చిత్రం షూటింగ్ దాదాపుగా 40 శాతానికి పైగా పూర్తి చేసుకుంది.అందువల్ల దర్శకుడు కొరటాల శివ ఈ చిత్రాన్ని ఆగస్టులో స్వాతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు.

అయితే ఇటీవల కరోనా వైరస్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ ని కొంతకాలం పాటు నిలిపివేస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించాడు.దీంతో అనుకున్న సమయానికి చిత్రం విడుదల అవుతుందో లేదో చూడాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Kajal Agarwal Demanding Huje Remuneration For Megastar Chiranjeevi Related Telugu News,Photos/Pics,Images..

footer-test