కాజల్‌ క్రేజ్‌ ఇంకా ఈ స్థాయిలో ఉందా?

చందమామ బ్యూటీ కాజల్‌ అగర్వాల్‌ సినిమా ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసి పుష్కర కాలం దాటింది.అయినా ఇప్పటి వరకు కూడా ఈ అమ్మడు స్టార్‌ హీరోలకు వాంటెడ్‌ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

 Latest Update Of Kajal Agarwal Remmunarion About Her Upcoming Movies, Kajal Agar-TeluguStop.com

తెలుగులో ఈమె ప్రస్తుతం ఆచార్య చిత్రంలో నటిస్తుంది.మరో వైపు తమిళంలో ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తోంది.

ఈ రెండు సినిమాలు కాకుండా చిన్నా చితకా సినిమాల్లో కూడా ఈ అమ్మడు ఆడి పాడుతూనే ఉంది.ఆమద్య కాస్త డల్‌ అయినట్లుగా అనిపించినా కూడా ఈ అమ్మడు ప్రస్తుతం మాత్రం జోరు మీదున్నట్లుగా కనిపిస్తోంది.

పారితోషికం విషయంలో ఇంకా కూడా ఈమె పట్టు వదలకుండా ఉండటం చూస్తుంటే ఈమెకు ఇంకా ఈ స్థాయిలో స్టార్‌డం ఉందా అనిపిస్తుంది.తాజాగా ఈమె రానా నటిస్తున్న హాతీ మేరీ సాతి చిత్రంలో గెస్ట్‌ రోల్‌లో నటించేందుకు గాను ఓకే చెప్పింది.

ఆ చిత్రంలో నటించేందుకు గాను కాజల్‌ అగర్వాల్‌ ఏకంగా 70 లక్షల పారితోషికం పొందుతుందట.కోటి డిమాండ్‌ చేయగా నిర్మాతలు 70 లక్షల వరకు బేరం తెగ్గొట్టారట.మొత్తానికి ఈ అమ్మడి వ్యవహారం మామూలుగా లేదుగా అంటున్నారు.

Telugu Acharya, Chandamama, Chiranjeevi, Indian, Kajal Agarwal, Rana-

సినిమాలో కేవలం 30 నిమిషాల పాటు కనిపించే గిరిజన యువతి పాత్రకు గాను ఈమె తీసుకుంటున్న ఈ పారితోషికం చాలా చర్చనీయాంశం అవుతోంది.భారీ ఎత్తున ఈ అమ్మడు పారితోషికం తీసుకోవడానికి మరో కారణం కూడా ఉంది.ఈ చిత్రంలో కాజల్‌ బ్లౌజ్‌ లేకుండా నటిస్తుందట.

అంటే పక్కా గిరిజన యువతి పాత్రలో పాత తరం అమ్మాయి పాత్రలో ఆమె కనిపించబోతున్నట్లుగా చెబుతున్నారు.మరి అసలు విషయం ఏంటీ అనేది ఆ సినిమా వస్తే కాని తెలియదు.

ఇక ఆచార్య చిత్రం కోసం కోటిన్నర ను అలాగే ఇండియన్‌ 2 చిత్రంకు గాను రెండు కోట్లకు పైగా పారితోషికంను కాజల్‌ దక్కించుకుంటున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి.ఈ వయసులో కూడా ఈ స్థాయి పారితోషికం తీసుకోవడం అంటే నిజంగా రికార్డు విషయం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube