దేశం కోసం పని చేద్దాం అంటున్న కాజల్ అగర్వాల్

కరోనా నేపధ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది.ఈ లాక్ డౌన్ కారణంగా దేశీయ ఆర్ధిక వ్యవస్థ దారుణంగా దెబ్బ తింటుంది.

 Kajal Agarwal Raise The Campaign Standing For India, Covid-19, Corona Effect, Lo-TeluguStop.com

ఇప్పటికే దేశ ఆర్ధిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.ఎప్పటికి ఈ లాక్ డౌన్ పూర్తవుతుందో.

మరల నష్టపోయిన వ్యాపారాలని ఎలా నిలబెట్టుకోవాలో అనే ఆలోచనలతో వ్యాపార దిగ్గజాలు అందరూ ఉన్నారు.ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్ధిక వ్యవస్థని మళ్ళీ గాడిలో పెట్టడానికి ఎం చేయాలో ఆలోచిస్తుంది.

ఇండియాలాంటి ప్రస్తుతం దేశీయ ఉత్పత్తి రంగం వైపు మెల్లగా అడుగులు వేస్తుంది.ఇది కొంత వరకు ఆర్ధిక వ్యవస్థని సుస్థిరం చేసుకోవడానికి ఉపయోగపడే అంశం.

అయిన వర్తక, వాణిజ్యం కోసం ఇప్పటికే మన దేశం చాలా విషయాలలో విదేశాలపై ఆధారపడుతుంది.

ఇదిలా ఉంటే కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా నష్టపోయారని మన దేశీయ వ్యాపారులకి మద్దతుగా నిలవాలని కథానాయిక కాజల్ అగర్వాల్ పిలుపునిచ్చింది.

పరిస్థితులు కుదుటపడ్డాక మనం మన దేశం కోసం పనిచేయాలి.మన ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం అవ్వడం కోసం కొన్నాళ్లు విదేశీ ప్రయాణాలు తగ్గించుకున్దాం.మన ఖర్చులన్నీ ఇక్కడే చేయాలి.మన దేశ బ్రాండులనే కొనాలి.

ప్రతి విషయంలోనూ మన దేశ ఉత్పత్తులనే వినియోగించాలి చేయాలి.ఇలా చేయడం ద్వారా దేశీయ ఉత్పత్తి రంగంకి, వ్యాపారులకి అండగా నిలబడినట్లు అవుతుంది అని కాజల్ అగర్వాల్ పిలుపునిచ్చింది.

ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఇలాంటి ఉద్యమమే నడుస్తుంది.విదేశీ బ్రాండ్ ల మీద మోజు తగ్గించుకొని దేశం కోసం నిలబడ్డ మన వ్యాపారులకి మద్దతుగా నిలబడాలని సోషల్ మీడియాలో కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube