తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది.కాని ఈయన ఈమద్య కాలంలో తెలుగు ప్రేక్షకులకు నచ్చే, మెచ్చే సినిమాలు చేయడం లేదు.
ఈయన టాలీవుడ్‌లో సక్సెస్ దక్కించుకుని చాలా రోజులు అయ్యింది.ఇలాంటి సమయంలో తెలుగు సూపర్ హిట్ మూవీ ‘ఖైదీ’ టైటిల్‌తో రాబోతున్నాడు.
ఖైదీ అనగానే అందరిలో అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి.కార్తీ చాలా విభిన్నంగా నటించడంతో పాటు హీరోయిన్ లేకుండా కనీసం పాటలు లేకుండా కామెడీ లేకుండా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
కొన్ని కారణాల వల్ల పదేళ్లు జైలు శిక్ష అనుభవించిన కార్తీ బయటకు వస్తాడు.పదేళ్లుగా తన కూతురును చూడకుండా ఉన్న అతడు జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూతురు వద్దకు వెళ్లాలనుకుంటే అనూహ్యంగా ఒక సమస్యలో చిక్కుకుంటాడు.ఈ సినిమా మొత్తం కూడా ఒక రోజులో నాలుగు గంటల్లో జరిగిన కథతో రూపొందించడం జరిగింది.
నటీనటుల నటన :
కార్తీ గతంతో పోల్చితే ఈ సినిమాలో కాస్త బరువు పెరిగినట్లుగా కనిపించాడు.ఈ సినిమాలోని పాత్ర కోసం అతడు బరువు పెరగడం మంచిదే అనిపించింది.ఇక కార్తీ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.ఒక కరుడు గట్టిన ఖైదీగా కార్తీ నటన చాలా బాగుంది.సినిమా మొత్తం కూడా ఒకే ఎమోషన్‌ను క్యారీ చేయడం అంటే సాధ్యం అయ్యే పనికాదు.
కాని ఆ పనిని ఈజీగానే కార్తీ చేశాడు.ఇందులో ఇంకా తెలిసిన వారు పెద్దగా ఎవరు లేరు.
ఎక్కువగా రౌడీల గ్యాంగ్స్ మాత్రమే కనిపించాయి.నరైన్ మరియు రమణలు వారి పాత్రలకు న్యాయం చేసే విధంగా నటించారు.
టెక్నికల్ :
దర్శకుడు లోకేష్ కనగరాజ్ లెక్కకు మించి షార్ట్ ఫిల్మ్స్ తీసి దర్శకుడిగా పరిచయం అయ్యాడు.షార్ట్ ఫిల్మ్స్ అనుభవంతో కేవలం నాలుగు గంటల కథను సినిమాగా మలవగలిగాడు.
ఇలాంటి కథలకు స్క్రీన్‌ప్లే చేయడం అనేది చాలా కష్టమైన పని.కాని ఆ పనిని లోకేష్ చక్కగా చేయగలిగాడు.కాని ఆయన స్క్రీన్‌ప్లేను ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగించి ఉంటే బాగుండేది.కథానుసారంగా సీరియస్‌గానే సాగించాడు.దర్శకత్వంలో కొన్ని లోపాలున్నాయి.పాటలు లేవు కనుక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గురించి మాట్లాడుకుంటే కొన్ని సీన్స్‌లో చాలా బాగుంది.
ఎమోషన్ సీన్స్‌ను పీక్స్‌కు తీసుకు వెళ్లడంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనితనం బాగుంది.సినిమాటోగ్రఫీ బాగుంది.
ఈ సినిమా మొత్తం రాత్రి సమయంలో సాగుతుంది.అంటే నైట్‌లో ఎక్కువ షూట్ చేశారు.
నైట్‌లో షూటింగ్ అంటే కెమెరామెన్‌కు కష్టం.అయినా కూడా మంచి ఔట్‌పుట్ ఇచ్చాడు.నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
ఇది పూర్తిగా నాన్ కమర్షియల్ సినిమా.ఇలాంటివి తెలుగు ప్రేక్షకులకు నచ్చడం అనేది చాలా అరుదు.ఒక పాట లేదు, కనీసం హీరోయిన్ లేదు, కామెడీ లేదు.ఇలాంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులు ఆధరించినట్లుగా దాఖలాలు లేవు.ఇదో ఆర్ట్ సినిమా తరహాలో సాగింది.
హీరో కార్తీ సాహసంతో ఈ పాత్రను చేశాడు.ఆయన ఓపిక మరియు తెగువకు మెచ్చుకోవాలి.
తమిళంలో ఇలాంటి సినిమాలు ఆడుతాయేమో కాని తెలుగులో ఈ చిత్రం ఆడటం కష్టమే అనిపిస్తుంది.కాని కేవలం నాలుగు గంటల్లో జరిగిన కథను సినిమాగా చూపించడం అది కూడా ఒక రాత్రిలో జరిగిన కథను చూపించడం అంటే మామూలు విషయం కాదు.
దీనికిగాను దర్శకుడు అభినందనీయుడు.కమర్షియల్‌గా ఏమో కాని ఈ విధంగా అయితే మెచ్చుకోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేవు.
మైనస్ పాయింట్స్ :
ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి మచ్చుకు కూడా లేవు ఇదే సినిమాకు అతి పెద్ద మైనస్
బాటమ్ లైన్ :
కార్తీ సాహసానికి హ్యాట్సాప్
రేటింగ్ : 2.0/5.0