హిందీ అర్జున్ రెడ్డి భామతో తెలుగు అర్జున్ రెడ్డి! బీటౌన్ లో హాట్ టాపిక్  

బాలీవుడ్ ఈవెంట్ లో మెరిసిన క్రేజీ హీరో విజయ్ దేవరకొండ. .

Kaira Advani Selfie With Vijay Devarakonda-bollywood,kaira Advani,telugu Cinema,tollywood,vijay Devarakonda

బీటౌన్ లో హీరో, హీరోయిన్స్ కలిసి ఎక్కడైనా కనిపిస్తే వెంటనే కథలు అల్లేస్తూ ఉంటారు. దానికి తగ్గట్లే అక్కడ హీరో, హీరోయిన్స్ మధ్య రీల్ రిలేషన్ తో పాటు రియల్ రిలేషన్ షిప్ కూడా కనిపిస్తూ ఉంటుంది. చాలా మంది స్టార్ట్ కో స్టార్స్ తో డేటింగ్ చేస్తూ ఉంటారు..

హిందీ అర్జున్ రెడ్డి భామతో తెలుగు అర్జున్ రెడ్డి! బీటౌన్ లో హాట్ టాపిక్ -Kaira Advani Selfie With Vijay Devarakonda

వారిలో కొంత మంది పెళ్లి వరకు వెళ్తూ ఉంటారు. ఇవన్ని పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్ హీరోలతో పాటు మన సౌత్ తెలుగు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా అక్కడి మీడియాకి ఎట్రాక్షన్ గా మారాడు. తాజాగా ముంబైలో జ‌రిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ ఇండియాస్‌ మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్‌ ఈవెంట్‌ జరిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి షారూఖ్ దంప‌తుల‌తో పాటు బాలీవుడ్ స్టార్స్ అక్ష‌య్ కుమార్, ర‌ణ‌వీర్ సింగ్‌, క‌రీనా క‌పూర్‌, క‌త్రినా కైఫ్‌, కియారా అద్వానీ త‌దిత‌రులు పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హాటెస్ట్ స్టైలిస్ట్ అవార్డు అందుకున్నారు. ఇక అవార్డుల అనంతరం మీడియాని ఎక్కువగా ఎట్రాక్ట్ చేసిన విజయ్ దేవరకొండ బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు.

అదే టైంలో బాలీవుడ్ ముద్దుగుమ్మ భరత్ అనే నేను సినిమాలో మహేష్ కి జోడీగా నటించిన కైరా అద్వాని విజయ్ తో సేల్ఫీ తీసుకొని తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఇది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ భామ ప్రస్తుతం హిందీ అర్జున్ రెడ్డి సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

గతంలో అర్జున్ రెడ్డి హీరో విజయ్ కి తాను పెద్ద ఫ్యాన్ అని కైరా ఆసక్తికర వాఖ్యలు చేసిన నేపధ్యంలో ఈ ఫోటో బాలీవుడ్ మీడియా హైలెట్ చేసింది.