టీడీపీ పై" కైకాల" షాకింగ్ కామెంట్స్   Kaikala Satyanarayana Shocking Comments On TDP Party     2017-10-08   01:54:18  IST  Bhanu C

తెలుగు సినిమా సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సంచలన కామెంట్స్ చేశారు.అదికూడా తాను వ్యవస్థపక సభ్యుడు అయిన తెలుగుదేశం మీద,నటుడిగా పేరు తెచ్చిపెట్టిన సినీ ఇండస్ట్రీ మీద.ఇప్పుడు కైకాల చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.కైకాల ఎందుకు అలా మాట్లాడారు అనే విషయాలు ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వివరాలలోకి వెళ్తే.

విజయవాడలో మహానటి సావిత్రి కళాపీఠం ఆధ్వర్యంలో సత్కారం అందుకోవడానికి వచ్చారు కైకాల.ఈ సందర్భంలో మాట్లాడుతూ..సినీ పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు కళామ్మ తల్లికోసం..ప్రేక్షకులని అలరించాలని సినిమాలు తీస్తుంటే. ఇప్పుడు కొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారు.తన సినీ జీవితంలో ఎక్కడా అసంతృప్తి లేదని, భగవంతుడి దయవల్ల అన్ని రకాల పాత్రల్లో నటించాను..అందుకే నవరసనటసార్వభౌమ బిరుదు కూడా వచ్చింది అని తెలిపారు.

ఎన్ఠీఆర్ తనని సొంత తమ్ముడిలా చూసుకునేవారని.ఆయనకి నాకు ఎంతో అనుబంధం ఉందని..అందుకే తెలుగుదేశం పార్టీ స్థాపనలో నాకు అవకాశం కల్పించి..వ్యవస్థాపక సభ్యుడిగా చేశారని తెలిపారు.కానీ ఇప్పుడు ఉన్న వాళ్ళు వ్యవస్థాపక సభ్యుడిని అయిన నన్ను మరిచిపోయారు..కనీసం సలహాలు అడగడం లేదు..పూర్తిగా పక్కన పెట్టేశారు అని బాధపడ్డారు.

అన్నగారు నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడానికి అప్పట్లో చాలా ప్రయత్నించారు అని తరువాత కుదరకపోవడంతో మచిలీపట్నం నుంచీ ఎంపీ గా అవకాశం కల్పిస్తే భారీ మెజారిటీతో నెగ్గాను అని తెలిపారు..అప్పట్లో నమ్మక ద్రోహులవలన పదవి పోగొట్టుకున్నాను..ఈ విషయంలో ఎన్ఠీఆర్ ఎంతో బాధపడ్డారు అని ఆనాటి విషయాలు తలుచుకున్నారు.అయితే టీడీపీ మీద కైకాల చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చినీయంగా మారాయి.