అన్నగారితో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. అప్పటి పోటీలో వామ్మో: కైకాల సత్యనారాయణ

Kaikala Satyanarayana Comment On Sn Ntr

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంచి పేరు సంపాదించుకున్న నందమూరి తారకరామారావు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈయన ఎన్నో సినిమాలలో నటించి విశేషమైన గుర్తింపు తెచ్చుకున్నారు అప్పట్లో అన్నగారి మాట అంటే ప్రతి ఒక్కరు కూడా గౌరవం.

 Kaikala Satyanarayana Comment On Sn Ntr-TeluguStop.com

అందరూ ఆయన మాటను అంగీకరించేవారు తప్ప అతనికి అడ్డు చెప్పేవారు ఎవరు ఉండరు.ఇలా ఇండస్ట్రీలో తనకంటూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీరామారావు ఒక విషయంలో కైకాల సత్యనారాయణతో బాగా పోటీ పడ్డారు.

ఆ విషయంలో సత్యనారాయణ అన్న మాటలను మనసులో ఉంచుకొని సమయం దొరికినప్పుడు తనపై ఈ విధంగా పగ తీర్చుకున్నారని చెప్పవచ్చు.ఇంతకీ వీరిద్దరి మధ్య ఏం జరిగింది అనే విషయానికి వస్తే…

 Kaikala Satyanarayana Comment On Sn Ntr-అన్నగారితో పెట్టుకుంటే మాములుగా ఉండదు.. అప్పటి పోటీలో వామ్మో: కైకాల సత్యనారాయణ-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సాధారణంగా ఎన్టీఆర్ సినిమా షూటింగ్ కు వచ్చారంటే తప్పనిసరిగా ఇతనికి ఇంటి నుంచి భోజనం వచ్చేది.

అయితే ఇంటి నుంచి కేవలం ఎన్టీఆర్ కు సరిపడా భోజనం మాత్రమే కాకుండా తనతో పాటు ఒక పదిమంది తినే భోజనాన్ని పంపిస్తారు.ఇక ఈయన సెట్లో ఉన్నప్పుడు ఏదైనా పండుగ వచ్చింది అంటే నిజంగా సెట్ లో ఉన్న అందరికీ అది ఒక పండుగ వాతావరణం అని చెప్పవచ్చు.

ఇలా పండుగ రోజు ఎన్టీఆర్ ఇంటి నుంచి సుమారు ఐదారు రకాల పిండివంటలు క్యారియర్ పంపించేవారు.

అయితే ఎన్టీఆర్ రాజనాల కలిసి నటిస్తున్నటువంటి గోపాలుడు భూపాలుడు అనే చిత్రంలో ఎన్టీఆర్ రాజనాల తినే విషయంలో పోటీ పడాల్సి ఉంటుంది.

పోటీలో ఎన్టీఆర్ గెలుస్తారు.ఎన్టీఆర్ పై ఉన్న అభిమానంతో రాజనాల తనని అల్లుడు అని పిలిచేవారు.

ఇక ఈ సినిమా చిత్రీకరణ పూర్తి అయిన తర్వాత ఇలా తింటే చాలా కష్టం అల్లుడు నీ గ్లామర్ దెబ్బతింటుంది అంటూ అతనికి చెప్పారు.అయితే ఈ సినిమాలో కైకాల సత్యనారాయణ నటించకపోయినా ఏదో పని నిమిత్తం అక్కడికి వెళ్లారు ఆ సమయంలో అన్న గారిని కలిసి ఇదే విషయం గురించి చర్చించడంతో అవును అన్నగారు ఎక్కువగా తినడం వల్ల మీ గ్లామర్ దెబ్బతింటుంది అని చెప్పారు.

Telugu Sn Ntr, Tollywood-Movie

ఈ విధంగా సత్యనారాయణ అన్న మాటలకు ఎన్టీఆర్ మనసులో ఏమనుకున్నారో తెలియదు కానీ బయటకు మాత్రం చూద్దాం బ్రదర్ అని అన్నారు.ఈ సినిమా విడుదలైన కొంతకాలానికి ఎన్టీఆర్ కైకాల సత్యనారాయణ అన్నదమ్ములుగా ఉమ్మడి కుటుంబం అనే చిత్రంలో నటించారు.ఇందులో ఎన్టీఆర్ కి సోదరుడుగా కైకాల సత్యనారాయణ నటించారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో పండుగ రావడంతో ఎన్టీఆర్ ఇంటి నుంచి పెద్ద ఎత్తున పిండివంటలు సినిమా సెట్ కి వచ్చాయి.

Telugu Sn Ntr, Tollywood-Movie

ఇక కైకాల సత్యనారాయణ గతంలో ఎన్టీఆర్ అన్న మాటలను దృష్టిలో ఉంచుకొని ఎన్టీఆర్ స్వయంగా దగ్గరుండి అతను వద్దన్నా వినకుండా భారీగా భోజనం వడ్డించారు.ఆ ఆహార పదార్థాలను తిన్న కైకాల పొట్ట మొత్తం ఉబ్బిపోయింది.అయితే భోజనం తిన్న తర్వాత గోపాలుడు భూపాలుడు సినిమా సమయంలో తను అన్న మాటలను గుర్తు పెట్టుకునే ఇలా చేశారని, అన్న గారితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని కైకాల సత్యనారాయణ ఒక సందర్భంలో అప్పుడు జరిగిన పోటీ గురించి బయట పెట్టారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube