ఆ చిన్నారి కడుపులోకి కెమెరాని పంపారు..! అందులో ఉన్నది చూసి డాక్టర్లు షాక్.! అసలేమైంది?

చిన్నపిల్లలకు ప్రతిదీ నోట్లో పెట్టుకునే అలవాటుంటుంది.ఆ ఏజ్ లో తెలియక చేసినప్పటికీ తర్వాత తర్వాత వాటిల్లో కొన్ని మనకు అలవాట్లుగా మారిపోతుంటాయి.

 Kadupulo Unnadhichusi Shock Ayina Dactors-TeluguStop.com

వాటిల్లో బాగమే బలపాలు తినడం,గోడకున్న సున్నం తినడం.లేదంటే ఎప్పుడూ నోట్లో ఏదైనా పెట్టుకుని నమలడం.

బియ్యం తినడం,మట్టి పెళ్లల్లు తినడం…ఈ తరహా ఈటింగ్ డిజార్డర్‌ను పికా అంటారు.ఈ వ్యాకులతతో బాధపడేవారు మట్టి, సుద్ద, రాళ్లు, పెయింట్లు మొదలైన వాటిని లాగించేస్తుంటారు.

ఇలాంటి అలవాట్లవలన కొన్ని సార్లు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి రావచ్చు.సరిగ్గా అలాంటి అలవాటు కారణంగానే ప్రాణం మీదికి తెచ్చుకున్నాడు ఒక పిల్లవాడు.

భటిండాకు చెందిన అర్జున్‌కు మొదటి నుంచి రబ్బర్ నమలడం అలవాటు.అమ్మానాన్న వారిస్తే.వారికి తెలియకుండా నమిలేవాడు.క్రమంగా అదో వ్యసనంలా మారింది.ఇప్పుడు అర్జున్ వయసు 16ఏళ్లు చిన్నప్పటినుండి ప్లాస్టిక్,చెక్క ముక్కలు నమిలి మింగడం అలవాటు ఉండడంతో.ఈ మధ్య ఒకసారిగా కడుపునొప్పి రావడంతో అర్జున్ అమ్మానాన్న హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.

పొట్ట లోపలికి కెమెరా పంపిన డాక్టర్లు లోపల ఏముందో చూసాకా షాకవ్వడం డాక్టర్ల వంతైంది.ఒక కిలో పరిమాణంలో చెక్క ముక్కలు, ప్లాస్టిక్ వ్యర్థాలు అతడి కడుపులో పేరుకుపోయాయి.

సర్జరీ చేసి అర్జున్ పొట్టలో నుంచి 300 గ్రాముల వ్యర్థాలను తొలగించినప్పటికీ ఇంకా 700గ్రాముల చెత్త అర్జున్ కడుపులోనే ఉండిపోయింది… మిగతా చెత్తనంతా బయటకు తీయాలంటే మరో మూడు సర్జరీలు అవసరం.ప్లాస్టిక్, చెక్క ముక్కలు తినే అలవాటు కారణంగా అతడికి ఏడాది క్రితం కడుపు నొప్పి వచ్చింది.ఊపిరి ఆడకపోవడం, ఆకలి మందగించడం లాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి.కానీ సాధారణ కడుపునొప్పే అని ఊరుకున్నారు.ఈ సారి మాత్రం కడుపునొప్పి తీవ్రంగా రావడం, హాస్పిటల్‌కు తీసుకెళ్లడానికి ముందు వారం రోజుల్లోనే 15 కిలోల బరువు తగ్గడం తో ఆందోలనతో పరీక్షల్లో ఈ విషయం బయటపడింది.కాబట్టి పిల్లల్లో ఇలాంటి అలవాట్లు ముందుగా గమనిస్తే మాన్పించడానికి ప్రయత్నించండి.

లేదంటే అర్జున్ లానే ఇబ్బంది పడాల్సొస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube