టీఆర్ఎస్ లో ' కడియం ' కష్టాలు ? 

తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో  మాజీ డిఫ్యూటీ సీఎం కడియం శ్రీహరి వ్యవహారం పెద్ద హాట్ టాపిక్ గా మారింది.ఆయన ఇప్పుడు పార్టీలో ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితి తలెత్తింది.

 Trs, Telangana Government, Kcr, Kcr, Etela Rajendar, Hujurabad Elections, Dalith-TeluguStop.com

మొన్నటివరకు కేసీఆర్ తనకు సరైన రాజకీయ ప్రాధాన్యత ఇస్తారని , కీలక పదవులు కట్టబెడతారు అని కడియం శ్రీహరి ఆశలు పెట్టుకున్నారు.అయితే దానికి భిన్నంగా ఇప్పుడు టిఆర్ఎస్ లో కడియం శ్రీహరి గత కొంత కాలంగా ఆందోళనలో ఉన్నారు.

ప్రస్తుతం టీఆర్ఎస్ లో కీలక నాయకులు అందరికీ హుజురాబాద్ ఎన్నికల బాధ్యతలను కేసీఆర్ అప్పగించారు.మంత్రి హరీష్ రావు ,కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే బాల్క సుమన్, ఆరూరి రమేష్, సండ్ర వెంకటవీరయ్య, సుంకే రవి , ఇలా చాలా మంది నేతలు కి అక్కడ బాధ్యతలు అప్పగించారు.

అయితే ఎస్సి సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి హుజూరాబాద్ నియోజకవర్గం లో ఒక్క మండలం బాధ్యత కూడా అప్పగించకపోవడం తీవ్ర చర్చనీయాంశమవుతోంది.

ఉన్నట్టుండి కడియం శ్రీహరి ని కెసిఆర్ పక్కన పెట్టడానికి కారణాలు చాలానే ఉన్నాయట.

దళిత బంధు పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోతే టిఆర్ఎస్ కు తీవ్ర నష్టం జరుగుతుందని, గతంలో కడియం శ్రీహరి చేసిన కామెంట్స్ కేసీఆర్ కు తీవ్ర ఆగ్రహం తెప్పించాయట.ఈ క్రమంలోనే కడియం శ్రీహరిని రైతు బంధు పథకం ప్రారంభోత్సవంకు కేసీఆర్ ఆహ్వానించలేదనే చర్చ జరుగుతోంది.

అందుకే మోత్కుపల్లి నరసింహులు వంటి వారికి ప్రాధాన్యం పెంచుతూ, దళిత సామాజిక వర్గం చెందిన ప్రజాప్రతినిధులు అందరికీ ఎక్కడాలేని ప్రాధాన్యం ఇస్తూ, శ్రీహరిని మాత్రం దూరంగానే పెడుతున్నారట.

Telugu Congress, Dalitha Bandu, Etela Rajendar, Hujurabad, Kadiyam Srihari, Tela

కొద్ది రోజుల క్రితం వరంగల్ జిల్లా పర్యటనకు వెళ్ళిన కేసీఆర్ స్వయంగా కడియం శ్రీహరి ఇంటికి వెళ్లి భోజనం చేశారు.దీంతో కడియం శ్రీహరిని కేసీఆర్ పక్కనపెట్ట లేదని, ఆయనకు ప్రాధాన్యం పెరుగుతోంది అని ప్రచారం జరుగుతున్న క్రమంలోనే, ఇప్పుడు గతంతో పోలిస్తే మరింత గా కెసిఆర్ కడియం శ్రీహరి న దూరం పెట్టడం వెనుక కారణాలు ఎవరికీ అంతుపట్టడం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube