వకీల్ సాబ్ నుండి 'కదులు కదులు' సాంగ్ విడుదల..!

పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా రాబోతున్న వకీల్ సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రేక్షకుల్లో ఫుల్ క్రేజ్ వచ్చింది.మరొక రెండు రోజుల్లో విడుదల కాబోతుండగా ఈ సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ తో పాటు అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

 Kadhulu Kadhulu Song Released From Vakeel Saab-TeluguStop.com

ఈ సినిమాకు ఇప్పటికే ప్రమోషన్స్ వీర లెవల్లో ఇస్తున్నారు.వకీల్ సాబ్ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది.అంజలి, నివేతా థామస్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాను దిల్ రాజు, బోణీ కపూర్ సంయుక్తం గా నిర్మిస్తున్నారు.ఈ సినిమా పింక్ సినిమా రీమేక్ గా తెరకెక్కుతుంది.

 Kadhulu Kadhulu Song Released From Vakeel Saab-వకీల్ సాబ్ నుండి కదులు కదులు’ సాంగ్ విడుదల..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలీవుడ్ లో పింక్ సినిమాలో అమితాబ్ బచ్చన్ నటించారు.ఇందులో పవన్ కళ్యాణ్ లాయర్ గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు.

Telugu Kadhulu Kadhulu Song, Kadhulu Kadhulu Song Released From Vakeel Saab, Pawan Kalyan, Vakeel Saab-Movie

పవన్ మూడేళ్ళ తర్వాత వెండితెరపై కనిపించబోతున్నాడు అందుకే పవన్ ఫ్యాన్స్ ఒక రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.ఈ సినిమాకు సంబంధించి ప్రతి చిన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది.ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇప్పుడు ఈ సినిమా నుండి కదులు కదులు అనే పాట విడుదల అయ్యింది.

ఈ పాట నిన్ననే విడుదల కావాల్సిన నేపథ్యంలో కొన్ని టెక్నికల్ ప్రొబ్లమ్స్ రావడం వల్ల చిత్ర యూనిట్ నిన్న విడుదల చేయలేకపోయింది.

అందుకే ఈ రోజు ఈ పాటను విడుదల చేసారు.ఈ పాట మహిళలను చైతన్య పరిచేలా ఉంది.

ఈ పాటకు సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యం అందించారు.ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కాబోతుంది.

#KadhuluKadhulu #Vakeel Saab #Pawan Kalyan #KadhuluKadhulu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు