ఈ కోడి మాసం కిలో రూ.900, గుడ్డు రూ.45.. ఇంతకు ఈ కోడి ప్రత్యేకతలేంటో తెలుసా?

సరైన వర్షాలు పడక, పంట చేతికి వచ్చిన సమయంలో వర్షాల వల్ల నానా ఇబ్బందులు పడుతున్న రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెదుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.కేవలం వ్యవసాయంపైనే ఆదారపడితే అతి వృష్టి లేదా అనావృష్టి సమయంలో రైతులు నష్టాల పాలవ్వాల్సి ఉంటుంది.

 Kadaknath Chicken Is Very Cost In The Market And Viral Too-TeluguStop.com

అందుకే రైతులు రెండవ ఆదాయ మార్గంగా పాడి పెంపకంను చేపట్టాలంటూ మొదటి నుండి కూడా ప్రభుత్వాలు రైతులను ప్రోత్సహిస్తున్నారు.

అయితే రైతులు పాడి కంటే ముఖ్యంగా పంటలపైనే శ్రద్ద పెడుతున్నారు.కాస్త శ్రద్ద పెడితే పాడి కూడా అద్బుతమైన ఫలితాలను, ప్రయోజనాలను, లాభాలను ఇస్తుంది.కొద్దిపాటి పెట్టుబడితో కడక్‌నాథ్‌ కోళ్లను పెంచడం వల్ల మంచి లాభాలను దక్కించుకోవచ్చు.

అన్ని వాతావరణాల్లో కూడా పెరిగే కడక్‌నాథ్‌ కోళ్లు మహారాష్ట్ర నుండి మెల్ల మెల్లగా తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తూ వస్తోంది.మహారాష్ట్ర నుండి అనంతపురం జిల్లాకు చెందిన రైతు ఏకాంతమయ్య తీసుకు వచ్చాడు.వ్యవసాయంలో ఏమాత్రం లాభాలుండటం లేదని, ఏదైనా కొత్తగా ప్రయత్నించాలని ఆలోచిస్తున్న ఏకాంతమయ్యకు కడక్‌నాథ్‌ కోళ్ల గురించి తెలిసింది.అతడు ఆ కోళ్ల గురించి ఇంటర్నెట్‌లో సెర్చ్‌ చేయగా మహారాష్ట్రలో ఎక్కువగా ఉంటాయని తెలుసుకున్నాడు.

నేరుగా అక్కడకు వెళ్లి కడక్‌నాథ్‌ కోళ్ల గురించి స్వయంగా తెలుసుకున్నాడు.

కడక్‌నాథ్‌ కోళ్లకు అక్కడ భారీ డిమాండ్‌ ఉంది.పూర్తిగా నల్లగా ఉండే ఈ కోడి మాసం కూడా నల్లగా ఉంటుంది.పలు ఔషద గుణాలున్న ఈ కోడి మాసం కిలో 800 నుండి 900 వరకు ఉంటుందట.

ఒకప్పుడు వెయ్యిని కూడా దాటి ఉండేదని, కాకుంటే ప్రస్తుతం కోళ్ల పెంపకం ఎక్కువ అవ్వడం వల్ల రేటు తగ్గిందని అంటున్నారు.ఇంకా ఎంత కోళ్ల పెంపకం పెరిగినా కూడా 700 రూపాయలకు మాత్రం తగ్గదని రైతు ఏకాంతమయ్య అంటున్నాడు.

మనం సాదారణంగా పెంచే నాటు కోళ్ల తరహాలోనే ఇవి కూడా ఏ వాతావరణంలో అయినా పెరుగుతాయి.అయితే వీటికి ఎక్కువ దానా అవసరం ఉంటుందట.

రెండు నెలల్లో ఈ కోసం దాదాపు కేజీ నుండి కేజీన్నర వరకు పెరుగుతుందట.నెలలో కనీసం 20 గుడ్లను ఈ కోడి పెడుతాయట.ఈ కోడి గుడ్లకు కూడా మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది.ప్రస్తుతం మహారాష్ట్రలో ఈ కోడి గుడ్లు 40 నుండి 50 రూపాయలు పలుకుతుందట.సాదారణ కోడి గుడ్డుకు కాస్త పెద్ద సైజ్‌లో ఉండి, పూర్తిగా నల్లగా ఉంటుంది.కడక్‌నాథ్‌ కోడి అంటేనే అన్ని నలుపే.

ఈకలు, కాళ్లు, మాసం, గుడ్డు ఇలా అన్ని కూడా నలుపే ఉంటాయి.భారీగా లాభాలను తెచ్చి పెడుతున్న కడక్‌ నాథ్‌ కోళ్ల గురించి నెట్‌ లో సెర్చ్‌ చేయండి తెలుస్తాయి.

ఎవరైనా ఆసక్తి ఉన్న వారికి ఇది ఉయోగపడవచ్చు దయచేసి షేర్‌ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube