కార్తీ 'సుల్తాన్' ఏ మేరకు ప్రభావం చూపనుంది?

తమిళ హీరోలు తెలుగు లో ఎంతో మంది స్టార్‌ డం ను దక్కించుకున్నారు.అందులో కార్తీ కూడా ఒకరు అనడంలో సందేహం లేదు.

 Kaarthi And Rashmika Sulthan Movie Releasing In Telugu , Kaarthi, Nagarjuna, Su-TeluguStop.com

ఆయన నటించిన ఆవార సినిమా తెలుగులో ఏ రేంజ్ లో వసూళ్లు చేసిందో అందరికి తెల్సిందే.ఆయన తెలుగులో డైరెక్ట్ గా ఊరిపి సినిమాలో కూడా నటించాడు.

ఆ సినిమా సమయంలోనే కార్తీ తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ అయ్యాడు.సినిమా ఏదైనా కూడా తెలుగులో ఆయన విడుదల చేయడం చాలా కామన్ గా వస్తుంది.

ఈ మద్య కాలంలో ఆయన నటించిన సినిమా లు తెలుగులో అంతగా రాణించడం లేదు.కాని ఈ వారంలో రాబోతున్న సుల్తాన్‌ మాత్రం ఖచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మంకను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.

భారీ ఎత్తున అంచనాలున్న సుల్తాన్‌ ను తెలుగులో పెద్ద ఎత్తున థియేటర్లలో విడుద లచేసేందుకు గాను ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

సుల్తాన్‌ విడుదల కాబోతున్న రోజే నాగార్జున నటించిన వైల్డ్‌ డాగ్ సినిమా విడుదల కాబోతుంది.

ఆ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.కనుక తెలుగు లో సుల్తాన్‌ సత్తా చాటాలంటే ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుంది.

మరి అంత విజయంను ఈ సినిమా దక్కించుకుంటుందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే ఈ సినిమా లో హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్నా ఈ సినిమా కు అదనపు ఆకర్షణగా నిలుస్తుందని అంటున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక మందన్నా టాప్‌ స్టార్ హీరోయిన్‌.

ఆమెను సరిగ్గా ఉపయోగించుకుని ప్రమోషన్ చేస్తే సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్తుంది.కాని సుల్తాన్‌ తెలుగు నిర్మాతలు పెద్దగా ఆ విషయమై దృష్టి పెడుతున్నట్లుగా అనిపించడం లేదు.

అందుకే సుల్తాన్ సినిమా తెలుగులో లో ప్రమోషన్‌ జోన్‌ లో ఉందంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.విడుదలకు మరో రెండు మూడు రోజుల సమయం ఉంది కనుక ఏం జరిగినా ఆశ్చర్య పోనక్కర్లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube