తెలుగులో ‘కాలా’ పరిస్థితి చెబితే నోరెళ్లబెడతారు       2018-06-08   23:56:03  IST  Raghu V

సౌత్‌ సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ సినిమాలు అంటే తెలుగు ప్రేక్షకులు అన్ని కోసేసుకుంటారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తమిళం స్థాయిలో తెలుగులో కూడా రజినీకాంత్‌ గతంలో వసూళ్లను సాధించాడు. తెలుగులో రజినీకాంత్‌ సినిమాలు డైరెక్ట్‌ సినిమాల కంటే కూడా అధికంగా వసూళ్లను సాధించాయి. ఇంతటి ఘన విజయాలు అందుకున్న రజినీకాంత్‌ గత కొంత కాలంగా తీవ్రంగా నిరాశ పర్చుతూ వస్తున్నాడు. ఈయన చేసిన, చేస్తున్న సినిమాలు ఏ ఒక్కటి కూడా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోతున్నాయి. లింగ సినిమా నుండి ఇప్పటి వరకు ఈయన చేసిన సినిమాలు అన్ని కూడా తెలుగులో డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబ్యూటర్లకు తీవ్ర నష్టాలను మిగిల్చింది.

-

ఇటీవలే ‘కబాలి’ చిత్రంతో తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకోవాలనుకున్న రజినీకాంత్‌ బొక్క బోర్లా పడ్డాడు. ఆ సినిమాపై ఉన్న అంచనాలతో డైరెక్ట్‌ సినిమా కంటే ఎక్కువగా పెట్టి కొనుగోలు చేయడం జరిగింది. కాని పరిస్థితి తారు మారు అయ్యింది. ఏమాత్రం ఆకట్టుకోని ఆ సినిమా డిజాస్టర్‌ కా బాప్‌ గా నిలిచింది. అంత జరిగినా కూడా అదే చిత్ర దర్శకుడితో రజినీకాంత్‌ సినిమా చేశాడు. రజినీకాంత్‌ అంతగా నమ్మాడు కనుక ‘కాలా’ సినిమా తప్పకుండా విజయాన్ని అందుకుంటుందనే నమ్మకం అందరిలో కలిగింది. అందుకే దిల్‌రాజు వంటి ప్రముఖ నిర్మాత ఈ చిత్రాన్ని కొనుగోలు చేసేందుకు ముందుకు వచ్చాడు.

దిల్‌రాజు ఈ చిత్రంపై పెట్టుకున్న ఆశలు అడియాశలు అయ్యాయి. దాదాపు 50 కోట్ల మేరకు ఈ చిత్రంపై దిల్‌రాజు మరియు ఎన్వీ ప్రసాద్‌లు ఇన్వెస్ట్‌ చేసినట్లుగా తెలుస్తోంది. వారు పెట్టిన పెట్టుబడికి కనీసం సగం కూడా రాబట్టలేక పోయింది. దాంతో ఇప్పుడు నిర్మాతల నెత్తిన పిడుగు పడ్డట్లయ్యింది. రజినీకాంత్‌ ‘కాలా’ చిత్రం తమిళంలో మంచి వసూళ్లను సాధిస్తున్నాయి. కాని రజినీకాంత్‌ సినిమా ఫ్లాప్‌ అయితే ఇక్కడ వసూళ్లు రాబట్టలేక పోతుంది.

తెలుగు స్టార్‌ హీరోల సినిమాలు సక్సెస్‌ అయినా, ఫ్లాప్‌ అయినా ఒక మోస్తరు వసూళ్లను రాబట్టగలవు. కాని ‘కాలా’ చిత్రం ఇప్పటి వరకు కేవలం 10 కోట్లను మాత్రమే రాబట్టిందని, లాంగ్‌ రన్‌లో మరో అయిదు కోట్ల వరకు సాధిస్తుందేమో అంటూ ట్రేడ్‌ పండితులు చెబుతున్నారు. ఇంత భారీ బడ్జెట్‌తో రూపొంది, భారీ మొత్తంకు కొనుగోలు చేసిన చిత్రం అంత తక్కువ రాబట్టడం అంటే ఎంత పెద్ద ఫ్లాప్‌పో అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రం రజినీకాంత్‌ గత చిత్రాల మాదిరిగా ఫ్లాప్‌గా నిలిచింది. రాబోతున్న ‘2.0’ చిత్రం అయినా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందేమో చూడాలి.

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.