పాల్ ముంచేస్తాడని జగన్ భయపడుతున్నాడా ?

ప్రజాశాంతి పార్టీ పేరుతో ఏపీ రాజకీయాల్లో హల్ చల్ చేస్తున్న కేఏ పాల్ వ్యవహారం పోలింగ్ తేదీ దగ్గరకు వచ్చే కొద్ది మిగతా రాజకీయ పార్టీలను కలవరపెట్టిస్తోంది.ముఖ్యంగా వైసీపీ కి ప్రజాశాంతి పార్టీ దెబ్బకొట్టేలా కనిపిస్తోంది.

 Ka Pauls Return Gift To Ys Jagan-TeluguStop.com

ఆ పార్టీ జెండా, గుర్తు, అభ్యర్థుల పేర్లు ఇవన్నీ వైసీపీని పోలి ఉండేలా ఉండడంతో తమ విజయావకాశాలను ఎక్కుడ దెబ్బతీస్తుందో అన్న ఆందోళన ఆ పార్టీలో కనిపిస్తోంది.ముందుగా పాల్ పార్టీని వైసీపీ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు.

కానీ ఎన్నికల తేదీ సమీపించేకొద్దీ ప్రజాశాంతి పార్టీ ఎఫెక్ట్ వైసీపీ మీదే ఎక్కువ పడేలా ఉండడంతో వైసీపీ అలెర్ట్ అయ్యి ఎదురుదాడి మొదలుపెట్టింది.

ఈసీ వద్ద ప్రజాశాంతి పార్టీ అనేక అనేక ఫిర్యాదులు ఇస్తూనే ఉంది.కేఏ పాల్ పార్టీకి ఈసీ హెలికాఫ్టర్ గుర్తు కేటాయించడం, దానిమీద వైసీపీ పదే పదే ఫిర్యాదులు చేయడం అయినా పాల్ వెనక్కి తగ్గకపోవడంతో వైసీపీ మరింత కంగారుపడింది.పాల్ కూడా ఎక్కడ మీడియా సమావేశం పెట్టినా తన పార్టీ సింబల్ కనిపించేలా చేత్తో పట్టుకుని కూర్చునేవారు మొదట్లో వైసీపీ నేతలు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు.

కానీ ఈసీ జాబితాలో ఉన్న గుర్తును చూసిన తర్వాత కంగారు మొదలయ్యింది.హెలికాఫ్టర్ రెక్కలు, ఫ్యాన్ రెక్కల్లాగే స్పష్టంగా ఉన్నాయి.కాస్త పరిశీలనగా చూస్తే తప్ప హెలికాఫ్టర్ కూడా ఫ్యాన్‌లాగే ఉందన్న అభిప్రాయం ఏర్పడింది.దీంతో వైసీపీ ఈ అంశంపై పదే పదే ఈసీకి ఫిర్యాదు చేసింది.

అయినప్పటికీ.ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు తన గుర్తును గట్టిగానే కాపాడుకోగలిగారు.

పాల్ రాజకీయాల్లో దూసుకుపోతా, ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి అయిపోతా అంటూ రకరకాల మాటలు చెప్పడం దాన్ని వైసీపీతో సహా అందరూ లైట్ గా తీసుకోవడం ఇప్పుడు సమస్య తీవ్రం అయిన తరుణంలో ఇలా ఆందోళన చెందుతోంది.పాల్ పార్టీ తరపున పోటీ చేయడానికి అసలు అభ్యర్థులు దొరుకుతారా అనే సందేహం అందరిలోనూ ఉండగానే వైసీపీ అభ్యర్థుల పేర్లను పోలి ఉండేవారిని ఎంపిక చేసుకుని మరీ నామినేషన్స్ వేయించడం అస్సలు ఊహించని పరిణామమే.వాస్తవానికి పాల్ పార్టీ వెనుక చంద్రబాబు ఉన్నారని వైసీపీ నేతలు అనేక సార్లు ఆరోపించారు.క్రైస్తవుల ఓట్లను చీల్చడానికి బాబు ఈ కొత్త ఎత్తుగడ వేసాడని పదే పదే విమర్శలు చేశారు.

ఇప్పుడు అదే నిజం అయినట్టుగా కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube