జనసేనను బెదిరిస్తున్న కేఏ పాల్ ...?

క్రైస్తవ మత ప్రభోధకుడిగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది … ఆరాధించబడిన డాక్టర్ కేఏ పాల్ ప్రజాశాంతి అనే రాజకీయ పార్టీ కూడా స్థాపించాడు.అయితే …ఆయన్ను ఒక రాజకీయ నాయకుడిగా కంటే… ఒక పొలిటికల్ కమెడియన్ గానే అంతా భావిస్తూ… వస్తున్నారు.

 Ka Paul Warns To Pawan Kalyan Janasena-TeluguStop.com

అయితే గత కొద్ది నెలలుగా తెగ హడావుడి చేస్తూ ….కనిపిస్తున్న పాల్ అన్ని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ గా చేసుకుని విమర్శల బాణాలు వదులుతున్నాడు.

అయితే పాల్ మాత్రం ఏదో ఒక వ్యూహంతోనే ఇప్పుడు కొన్ని కొన్ని సామజిక వర్గాలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నట్టు కనిపిస్తోంది.అయితే ఇదంతా ఆయన కావాలని చేస్తున్నాడా …? లేక ఆయన వెనుక ఎవరన్నా ఉన్నారా అనే అనుమానం అందరిలోనూ కలుగుతోంది.

పాల్ మాత్రం పదే పదే తాను కాపు సామజిక వర్గానికి చెందిన వ్యక్తిని అంటూ… చెప్పడం వెనుక ముఖ్యంగా ఒక పార్టీని టార్గెట్ చేసుకుని ఆయన రంగంలోకి దిగినట్టుగా కూడా అనుమానాలు కలుగుతున్నాయి.

అవినీతి రహిత సమాజ స్థాపనే తన లక్ష్యంగా ప్రజాశాంతి పార్టీని స్థాపించాను అంటూ చెప్తున్న కేఏ పాల్.

ప్రస్తుత పరిస్థితుల్లో తాను తప్ప ఏపీకి వేరే దిక్కు లేదని.ఏ రాజకీయ పార్టీ అయిన తన మద్దతు లేకపోతే చిత్తే అని బహిరంగంగానే ప్రకటిస్తూ… మరింత కాకరేపుతున్నాడు.అయితే… పాల్ ఇప్పుడు జనసేన పార్టీకి బెదిరింపుతో కూడిన ఆఫర్ ను జనసేన పార్టీకి ఇస్తున్నాడు.తన భావాలకు అనుగుణంగానే పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు.

తమతో పొత్తు పెట్టుకోకపోతే… జనసేనకు ఒక్క సీటు రాదని.ఇప్పటికే పవన్ ఆలస్యం చేయకుండా తనను కలవాలి అంటూ పిలుపునిచ్చారు.ఇక ప్రధాని మోదీ, ఏపీ సీఎం చంద్రబాబును కూడా పాల్ వదల్లేదు.అసలు ఏపీ రాష్ట్ర ఆదాయానికి, బడ్జెట్‌కు పొంతనే లేదని విమర్శించారు.ఏపీ ప్రస్తుత ఆదాయం కేవలం రూ.1.5 లక్షల కోట్లని, బడ్జెట్ మాత్రం రూ.3.5 లక్షల కోట్లని పేర్కొన్న పాల్.మిగతా రెండు లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు.

రాష్ట్రానికి 5 లక్షల కోట్లు తెచ్చే సత్తా తనకు మాత్రమే ఉందన్నారు.అయితే పాల్ వ్యాఖ్యలను మాత్రం జనసేన పార్టీ యధాప్రకారం కామెడిగానే తీసుకుంటోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube