బీజేపీ కి గట్టిగా బుద్ధి చెప్పండి అంటున్న కేఏ పాల్..!!

తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కే ఏ పాల్ వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు.జరగబోయే ఈ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పాలని తిరుపతి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

 Ka Paul Strong Warning To Bjp-TeluguStop.com

తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసిన ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చారా ?, తిరుపతిని స్మార్ట్ సిటీ గా కట్టార ?, రైతులకు మరియు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలలో కనీసం ఒక్కటైన నెరవేర్చారా ?ఇదేమి నెరవేర్చలేదు.

పైగా మూడున్నర లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తమకు అనుకూలంగా ఉన్న ప్రైవేటు వ్యక్తులకు అమ్మేయాలని చూస్తున్నారు.

 Ka Paul Strong Warning To Bjp-బీజేపీ కి గట్టిగా బుద్ధి చెప్పండి అంటున్న కేఏ పాల్..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దానిపై ఇప్పటికే మూడు సార్లు తాను న్యాయస్థానాన్ని ఆశ్రయించినటు పాల్ స్పష్టం చేశారు.ఈ క్రమంలో త్వరలోనే ఈ విషయానికి సంబంధించి సుప్రీంకోర్టు కి వెళ్తున్నట్టు స్పష్టం చేశారు.

తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ పార్టీ ఇస్తున్న హామీలు మరియు యాక్టర్ చేస్తున్నా యాక్టింగ్ కి ఎవరు లొంగిపోకుండా జ్ఞానంతో జరగబోయే ఎలక్షన్ లో ఓటు వేయాలని తిరుపతి  ప్రజలు గట్టిగా బిజెపికి బుద్ధి చెప్పాలని  విజ్ఞప్తి  చేశారు.  ఎన్నికలలో ఎవరు నచ్చకపోతే  కనీసం నోటా కి అయినా ఓటు వేయాలని  కోరారు.

 

#Tirupathi #KA Paul

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు