వైసీపీతో అభ్యర్ధులతో పోలి ఉన్న అభ్యర్ధులు ప్రజాశాంతి పార్టీ కాదా! కేఏ పాల్ ట్విస్ట్

ఏపీ రాజకీయాలలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది.ఎన్నికల నామినేషన్లు తర్వాత ఏపీలో 35 నియోజకవర్గాలలో వైసీపీ అభ్యర్ధుల పేర్లతో ఉన్న అభ్యర్ధులని ప్రజాశాంతి పార్టీ తరుపున బరిలో నిలబడటం సంచలనంగా మారింది.

 Ka Paul Sensational Comments On Ysrcp And Tdp-TeluguStop.com

దీనిపై ఒక్కసారిగా ఏపీలో రాజకీయం వేడెక్కింది.ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వెనుక చంద్రబాబు ఉండి ఇదంతా చేస్తున్నాడని, వైసీపీ గెలుపుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ విమర్శలు చేసింది.

దాంతో పాటు ప్రజాశాంతి పార్టీ మీద ఎన్నికల కమిషన్ కి వైసీపీ ఫిర్యాదు చేసింది.అలాగే ప్రజాశాంతి పార్టీ గుర్తుని కూడా రద్దు చేయాలని కోరింది.

ఇక దీనిపై గత కొద్ది రోజులుగా వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.అలాగే సోషల్ మీడియాలో కూడా ప్రజాశాంతి పార్టీ వెనుక ఉండి టీడీపీ డ్రామా ఆడుతుంది అని విమర్శలు వినిపించాయి.

ఇదిలా ఉంటే తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ సంచలన వాఖ్యలతో మరో సారి రాజకీయాన్ని వేడెక్కించారు.వైసీపీ అభ్యర్ధులతో పోలిన పేర్లుతో వారి మీద పోటీ చేస్తున్న అభ్యర్ధులు తన పార్టీకి చెందిన వారు కాదని స్పష్టం చేసాడు.

వారిని చంద్రబాబే నిలబెట్టారని, వారితో తన పార్టీకి సంబంధం లేదని స్పష్టం చేసారు.తాను టీడీపీ మనిషిని అయితే ఆ పార్టీని ఎందుకు విమర్శలు చేస్తానని చెప్పుకొచ్చారు.

కేఏ పాల్ వాఖ్యాల నేపధ్యంలో ఇప్పుడు వైసీపీ, టీడీపీ ఎలా స్పందించబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube