అందరినీ విమర్శించేసిన కేఏ పాల్  

పొలిటికల్ కామెడీ స్టార్ గా ఈ మధ్య వార్తల్లోకి ఎక్కుతున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఏపీలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో స్పీడ్ పెంచారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్, జనసేన పార్టీ ఇలా ఏ పార్టీని వదలకుండా అన్ని పార్టీల నాయకులను చెడామడా తిట్టారు. తనకు మిగతా రాజకీయ పార్టీల నాయకుల నుంచి ప్రాణహాని ఉందని… అందుకే సెక్యూరిటీ అడుగుతున్నానని అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు మాటలు రాని వ్యక్తి కి మూడు శాఖలు ఇచ్చి మంత్రిని చేశాడు అంటూ… విమర్శలు గుప్పించారు. ప్రజాబలం ముందు బాలకృష్ణ, హరికృష్ణ వంటి వారు పనికిరారని …. అసలు వంద కోట్లు ఖర్చు పెట్టిన సుహాసిని గెలిచిందా అంటూ ప్రశ్నించారు.

Ka Paul Sensational Coments On All Party Leaders-

Ka Paul Sensational Coments On All Party Leaders

0 197 దేశాల్లో నేను ఎక్కడ తీసుకోలేదని చెప్పుకొచ్చారు. మోడీ చంద్రబాబు జగన్ కు ప్రపంచంలో ఎక్కడైనా విలువ ఉందా అంటూ ఎద్దేవా చేశారు.టిడిపి అధినేత చంద్రబాబు ఇచ్చిన 602 హామీలు ఏ ఒక్కటి నెరవేర్చలేకపోయారని… జగన్ మోడీ చంద్రబాబుల మీద విరుచుకుపడ్డ పాల్ … చంద్రబాబు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా మరోసారి ముఖ్యమంత్రి అవ్వలేరని శాపనార్ధాలు పెట్టారు. జగన్ కు రౌడీయిజం తప్ప మరేమీ తెలియదని , మోడీ చంద్రబాబుల డ్రామాలు ఆడుతున్నారని వీటిని ప్రజలు నమ్మరని ఆయన చెప్పుకొచ్చారు.