పవన్ ని మించిపోయా అంటున్న కేఏ పాల్ .. ఏంటి సంగతి..?  

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గురించి అందరికీ బాగా తెలుసు కదా ! అయన ప్రెస్ మీట్ అయినా.. టీవీలో ఇంటర్వ్యూ అయినా జనాలు కదలకుండా మరీ చూస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు అంటే… ? ఆయనను ఓకే మత ప్రబోధకుడుకంటే … ఒక కమెడియన్ గా చాలా మంది గుర్తుంచారు. అయితే ఇంత గుర్తింపు రావడానికి కారణం మాత్రం ఆయన చేసే సంచలన వ్యాఖ్యలే కారణం. తాజాగా ఇదే తరహాలో ఆయన తన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేసాడు.

Ka Paul Satires On Pawan Kalyan-

Ka Paul Satires On Pawan Kalyan

పవన్ కళ్యాణ్ కంటే తనకే ఫాలోయింగ్ ఎక్కువని కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ఏపీలో ‘జనసేన’ లాంటి చిన్న పార్టీల మీటింగ్‌లకే అవకాశం ఇస్తున్నారని, కానీ తన మీటింగ్‌లను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు. కేవలం 3 నుంచి 4 ఓటింగ్ శాతం ఉన్న జనసేనకి అనుమతి ఇచ్చి, తమకెందుకు అవకాశం ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ సభలకు లక్షల మంది వస్తారనే ఉద్దేశంతోనే అనుమతులు ఇవ్వడంలేదేమోనని అన్నారు. ‘‘ఇటీవల ఓ ఛానెల్‌తో మాట్లాడుతూ బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పా. ఆ వీడియోను యూట్యూబ్‌లో సుమారు 14 లక్షల మంది చూశారు.

Ka Paul Satires On Pawan Kalyan-

నేను ఇండియా వదిలి 30 సంవత్సరాలైంది. ఆంధ్రాలో ఉన్నది చాలా తక్కువ. అమెరికాలో నేను ఎంజిలినా జోలిని చూశా, షారుక్‌ఖాన్‌, అమితాబచ్చన్‌లను చూశా. అలాంటి నేను బాలకృష్ణ ఎవరో తెలియదని చెప్పడంలో ఏం తప్పు ఉంది? ఆ వీడియోను లక్షలు మంది చూశారు. అదే చానెల్‌లో పనవ్ కళ్యాణ్ మాట్లాడితే 5వేలు, 10వేలు మంది మాత్రమే చేస్తున్నారు. అంటే, వాళ్లకంటే నాకు 100 రెట్లు ఫాలోయింగ్ ఉన్నట్లే కదా.అంటూ మరో కామెడీ చేశారు పాల్.