జనసేనానికి బంపర్ ఆఫర్ ఇచ్చిన కేఏ పాల్     2019-01-07   22:41:49  IST  Sai Mallula

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు… క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ఈ మధ్య తరుచూ … వార్తల్లోకి ఎక్కుతున్నాడు. గత ఎన్నికల్లో పార్టీ పెట్టడమే కాకుండా … మెజార్టీ సీట్లలో అభ్యర్థులను పోటీకి దింపి బొక్క బోర్లా పడ్డాడు. అయినా …ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా బరిలో నిలిచి అధికారం దక్కించుకుంటాము అంటూ … పాల్ చాలా కామెడీ నే పండిస్తున్నాడు.

Ka Paul Open Offer To Pavan Kalyan-

Ka Paul Open Offer To Pavan Kalyan

ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు పాల్ ఓ బంపర్ ఆఫర్ కూడా ప్రకటించాడు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అంటూనే.. ప్రజా శాంతి పార్టీకి ఎవరితోనూ పొత్తు అవసరం లేదని.. ఒకవేళ ఎవరైనా తమతో కలిసి వస్తామంటే ఐదో, పదో సీట్లు ఇస్తామంటున్నారు. తమతో పొత్తు కోసం చాలా పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని.. పవన్ కళ్యాణ్ ఓకే అంటే కలిసి పోటీ చేస్తామంటూ పాల్ ప్రకటించాడు.