ఏపీ ప్రభుత్వం పై హైకోర్టులో పిటిషన్ వేసిన కేఏ పాల్..!!

ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కెఏ పాల్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంపై హైకోర్టులో పిటిషన్ వేశారు.విషయంలోకి వెళితే కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం పరీక్షల విషయంలో వెనకడుగు వేయకుండా .

 Ka Paul Has Filed A Petition In The High Court Against The Ap Government,  Ka Pa-TeluguStop.com

యధావిధిగా పరీక్షలు నిర్వహించడాన్ని తప్పుపడుతూ కేఏ పాల్ పిటిషన్ వేయడం జరిగింది.అంతే కాకుండా రాష్ట్రంలో కేసులు పెరుగుతూ ఉండటంతో .ప్రభుత్వం మొండిగా పరీక్షల విషయంలో వ్యవహరించటం ఏ మాత్రం మంచిది కాదని తెలిపారు. దేశంలో రోజుకి చాలా మరణాలు సంభవిస్తున్నాయి, ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి తన బిడ్డలను పరీక్షలకు పంపించగలరా.?, వైసీపీ మంత్రులు పంపించగలరా అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ఈ విధంగా వ్యవహరిస్తే విద్యార్థులకు అదేవిధంగా తల్లిదండ్రులకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని వెంటనే టెన్త్, ఇంటర్ పరీక్షలు ఏపీ ప్రభుత్వం వాయిదా వేయాలని సూచించారు.

కేంద్రం అదేవిధంగా పొరుగు రాష్ట్రాలలో చాలాచోట్ల పరీక్షలు వాయిదా వేయడం జరిగిందని స్పష్టం చేశారు.ఒకపక్క కేసులు, మరణాలు పెరిగిపోతూ ఉన్న ఇటువంటి కష్ట సమయంలో.విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వాలు చెలగాటం ఆడటం అంత మంచిది కాదని… ఒక కేఏపాల్ మాత్రమే కాక రాష్ట్రంలో మిగతా ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube