ట్రంప్ ని ఓటమే లక్ష్యంగా “ కె ఏ పాల్ ” సంచలన పుస్తకం..!!!

అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ కొనసాగే అర్హత లేదని, ట్రంప్ చేసిన తప్పులు ట్రంప్ ని ఓడించడానికి కాచుకుని కూర్చున్నాయని అంటన్నారు ప్రపంచ ప్రఖ్యాత సువార్తికుడు కె ఏ పాల్.గతంలో అంటే 2016 సమయంలో ట్రంప్ కి ఆధ్యాత్మిక సలహాదారుడిగా వ్యవహరించిన ట్రంప్ అప్పట్లో ట్రంప్ గెలుపుకి దేవుడిని ప్రార్ధించిన పాల్ ప్రస్తుతం ట్రంప్ ఓటమి కోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

 K.a. Paul Relase The Book Of Save America And The World From Trump, Ka Paul, Don-TeluguStop.com

అసలు ట్రంప్ ని ఓడించడానికి, అధ్యక్షుడిగా కొనసాగకుండా ఉండటానికి 10 కారణాలు వివరిస్తూ ఓ పుస్తకాన్ని సైతం విడుదల చేశారు పాల్.

“Save america and the world from trump” అనే పుస్తకాన్ని స్వయంగా రాసిన ట్రంప్ అందులో ట్రంప్ ని ఓడించడానికి గల 10 కారణాలని తెలిపారు.

అధ్యక్షుడు ట్రంప్ కి మద్దతు ఇచ్చే వారితో పాటు, ఈ దేశాన్ని కాపాడాలని అనుకునే ప్రతీ ఒక్కరూ ఈ పుస్తకాన్ని తప్పకుండా చదవాలని పాల్ తెలిపారు.ఖగ్గోషి హత్యలో ఎంబిఎస్ కీలక పాత్ర పోషించాలని పాల్ తెలిపారు.

వాస్తవానికి ట్రంప్, అతడి అల్లుడు కుశ్నర్ సౌదీ రాజు తో కలిసి బిలియన్ డాలర్ల చట్ట విరుద్దమైన ఒప్పందం కుదిరిందని పాల్ ఆరోపణలు చేశారు.ఈ పుస్తకంలో ఇలాంటి విషయాలో ఎన్నో పొందు పరిచానని పాల్ ప్రకటించారు.ఇదిలాఉంటే

Telugu America, Donald Trump, Ka Paul, Khagoshi, Kushnar, Saudi-

తాను రాసిన పుస్తకం మిగిలిన వాటికంటే భిన్నంగా ఉంటుందని, ఇది ట్రంప్ ఆధ్యాత్మిక సలహాదారుడిగా అందరి ఆమోదంతో వచ్చిన వ్యక్తి రాసిన పుస్తకమని పాల్ తెలిపారు.జాత్యాహంకారాన్ని అణగదొక్కాలంటే ట్రంప్ ని ఓడించండి, అమెరికాని, ప్రపంచాన్ని ట్రంప్ నుంచీ కాపాడండి అంటూ పాల్ ప్రకటించారు.అంతేకాదు ఈ పుస్తకం అమెజాన్ లో అందుబాటులో ఉంటుందని తెలిపారు.ఇది అమ్మగా వచ్చే డబ్బుని సేవ్ అమెరికా స్వచ్చంద సంస్థకి ఇచ్చేస్తానని అన్నారు కె ఏ పాల్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube