ఆ పొత్తుపై కేఏ పాల్ కూడా స్పందించేశారు  

Ka Paul Comments On Pawan Kalyan About Janasena And Bjp Alliance-chiranjeevi In Praja Rajyam Party,janasena Chief Pawan Kalyan,ka Paul,ka Paul Comments On Pawan Kalyan Voteing Percentage,praja Shanthi Party Chief Ka Paul

పొలిటికల్ కమెడియన్ గా ముద్ర వేయించుకున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ ఎన్నికల తర్వాత సైలెంట్ అయినా, ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయ వ్యవహారాల్లో తల దూరుస్తూ మళ్లీ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.అందుకే తరచుగా పొలిటికల్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Ka Paul Comments On Pawan Kalyan About Janasena And Bjp Alliance-chiranjeevi In Praja Rajyam Party,janasena Chief Pawan Kalyan,ka Paul,ka Paul Comments On Pawan Kalyan Voteing Percentage,praja Shanthi-KA Paul Comments On Pawan Kalyan About Janasena And BJP Alliance-Chiranjeevi In Praja Rajyam Party Janasena Chief Ka Voteing Percentage Shanthi Ka

తాజాగా జనసేన, బిజెపి పార్టీలు కలిసి పొత్తు పెట్టుకోవడంపై ఆయన స్పందించారు.నిన్ననే బిజెపి జనసేన పార్టీ ల మధ్య అధికారికంగా పొత్తు ఖరారైంది.

ఏపీకి బీజేపీ పార్టీ తో అవసరం ఉందని, అందుకే తాను బీజేపీతో కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నాను అంటూ పవన్ ప్రకటన విడుదల చేశారు.

ఇకపై అధికార వైసీపీ పై ఈ రెండు పార్టీలు ఉమ్మడిగా పోరాటం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పవన్ కళ్యాణ్ కేవలం అధికారం కోసం మాత్రమే పార్టీ పెట్టారని, ఆయనకు 5 నుండి 6 శాతం మాత్రమే ఓట్లు వస్తాయని తాను ఎన్నికల ముందే చెప్పానని పాల్ అన్నారు.అసలు పవన్ పోటీచేసిన స్థానంలో ఓడిపోతాడని తాను ముందే చెప్పానని, అలాగే రెండు మూడు పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్లినా పవన్ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది అంటూ పాల్ విమర్శించారు.

పవన్ కు సొంత సామాజిక వర్గానికి చెందినవారే ఓట్లు వేయలేదని, పవన్ సామాజిక వర్గానికి చెందిన 25 శాతం మంది ప్రజలు కూడా పవన్ కు ఓటు వేయలేదని, 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఎన్నికలకు వెళ్లిన పవన్ అన్నయ్య చిరంజీవి 18 శాతం ఓట్లను సాధిస్తే పవన్ ఆరు శాతం ఓట్లు మాత్రమే ఇప్పుడు సాధించగలిగారు అని పాల్ విమర్శలు చేసారు.ఇప్పుడు బిజెపితో పవన్ కలిసినా పెద్దగా కలిసి వచ్చేది ఏమీ లేదని పాల్ ఎద్దేవా చేశారు.

అయితే కేఏ పాల్ వ్యాఖ్యలు జనసేన కానీ, బీజేపీ కానీ పెద్దగా పరిగణలోకి తీసుtకోవడంలేదు.ఆయన ఒక పొలిటికల్ కమెడియన్ అని ఆయన మాటలకు విశ్వసనీయత లేదని వారు కొట్టిపారేస్తున్నారు.

.

తాజా వార్తలు

Ka Paul Comments On Pawan Kalyan About Janasena And Bjp Alliance-chiranjeevi In Praja Rajyam Party,janasena Chief Pawan Kalyan,ka Paul,ka Paul Comments On Pawan Kalyan Voteing Percentage,praja Shanthi Party Chief Ka Paul Related....