కేఏపాల్‌ బయోపిక్‌ కామెడీగా ఉంటుందా? సీరియస్‌గా ఉంటుందా?  

Ka Paul Biopic Movie Coming Soon-

తెలుగు రాష్ట్రాల వారికి కేఏపాల్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.కేవలం తెలుగు రాష్ట్రాల వారు మాత్రమే కాకుండా ప్రపంచంలోని పలు దేశాల వారు, దేశాల అధినేతలకు కూడా కేఏ పాల్‌ గురించి తెలుసు.అయితే కేఏ పాల్‌ను తెలుగు రాష్ట్రాల వారు కమెడియన్‌ అంటూ ఉంటే ప్రపంచ దేశాల వారు మాత్రం ఒక గొప్ప శాంతి కపోతకుడు, పలు యుద్దాలు ఆపిన క్రైస్తవ మత బోధకుడు అని అంటూ ఉంటారు.

Ka Paul Biopic Movie Coming Soon--Ka Paul Biopic Movie Coming Soon-

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ ద్వారా పాల్‌ పోటీ చేశాడు.

Ka Paul Biopic Movie Coming Soon--Ka Paul Biopic Movie Coming Soon-

ఎన్నికల సమయంలో హడావుడి చేసి కమెడియన్‌ అంటూ పేరు తెచ్చుకుంటున్న క్రైస్తవ మత బోధకుడు కేఏపాల్‌ ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు.ఆయన జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఒక దర్శకుడు సిద్దం అవుతున్నాడు.

ప్రస్తుతం ఇండియాలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తుంది.అందుకే కేఏపాల్‌ వంటి గొప్ప వ్యక్తి కథను కూడా జనాల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ఆ దర్శకుడు చెబుతున్నాడు.

కేఏపాల్‌ గురించి అతడు తీయబోతున్న బయోపిక్‌లో కామెడీ సీన్స్‌ ఉంటాయా సీరియస్‌ సీన్స్‌ ఉంటాయా అంటూ కొందరు అప్పుడే కామెంట్స్‌ చేస్తున్నారు.కేఏ పాల్‌ సినిమా అంటే జనాలు కొందరు నవ్వుతున్నారు.ఆయన జీవితం గురించి ఏముందని సినిమాలో చూపించాలని భావిస్తున్నారు అంటూ దర్శకుడిని ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే ఆ దర్శకుడు సునీల్‌ అనే నటుడిని పాల్‌ పాత్ర కోసం ఎంపిక చేశాడు.ఇద్దరు హీరోయిన్స్‌ ఈ చిత్రంలో ఉండనున్నారు.విదేశీ నటీనటులు కూడా ఈ చిత్రంలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.వచ్చే ఏడాది వరకు ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉందట.త్వరలోనే పూర్తి వివరాలు వెళ్లడి కానున్నాయి.