విశ్వనాథ్ ఎస్ సెంటిమెంట్ గురించి తెలుసా.. ఆ సినిమాలన్నీ హిట్టేనా?

కె.విశ్వనాథ్ టాలీవుడ్ ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకులలో ఒకరు కాగా ఆయన మరణం ఇండస్ట్రీని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

 K  Vishwanath S  Sentiment Details Here Goes Viral In Social Media , K  Vishwana-TeluguStop.com

ఆయన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో మెజారిటీ సినిమాలు ఎస్ లెటర్ తో తెరకెక్కిన సినిమాలు సక్సెస్ సాధించాయి.కె.

విశ్వనాథ్ సినిమాలలోని పాత్రలు సైతం ఒకింత కొత్తగా ఉండటంతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

విశ్వనాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి, శంకరాభరణం, శుభోదయం, సాగరసంగమం, సప్తపది, శుభలేఖ, స్వయంకృషి, సిరివెన్నెల, స్వాతిముత్యం, స్వాతి కిరణం, సూత్రధారులు, స్వర్ణ కమలం, శుభప్రదం, స్వరాభిషేకం, శుభ సంకల్పం సినిమాలు తెరకెక్కాయి.

ఈ ఎస్ సెంటిమెంట్ గురించి ఒక సందర్భంలో విశ్వనాథ్ మాట్లాడుతూ తాను ఏ సినిమాకు కావాలని టైటిల్ ను పెట్టలేదని తెలిపారు.

Telugu Vishwanath, Sirisirimuvva, Sitamalakshmi, Swarabhishekam, Swathikiranam,

కథకు సరిపోయే టైటిల్ ను మాత్రమే నేను పెడతానని అయితే ఊహించని విధంగా మూవీ టైటిల్ ఎస్ తో మొదలయ్యేదని ఆయన కామెంట్లు చేశారు.హిందీలో కూడా ఆయన సినిమాలు ఎస్ తో ప్రారంభమై అక్కడ కూడా విజయం సాధించాయి.ఒక సందర్భంలో విశ్వనాథ్ మాట్లాడుతూ హిందీలో నా ప్రవేశం వెరైటీగా జరిగిందని అన్నారు.

విశ్వనాథ్ హిందీలో 10 సినిమాలను తెరకెక్కించారు.

Telugu Vishwanath, Sirisirimuvva, Sitamalakshmi, Swarabhishekam, Swathikiranam,

ఈ 10 సినిమాలలో 8 సినిమాలు రీమేక్ సినిమాలు కావడం గమనార్హం.అల్లుడు పట్టిన భరతం, స్వయంకృషి సినిమాలను హిందీలో రీమేక్ చేయాలని ఆయన భావించినా ఆయన కోరిక నెరవేరలేదు.ఎస్ లెటర్ తో తెరకెక్కిన విశ్వనాథ్ సినిమాలలో మెజారిటీ సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాలు ఫ్యాన్స్ ను ఒకింత హర్ట్ చేస్తున్నాయి.పేరొందిన సినీ ప్రముఖులు మరణించడం సినీ అభిమానులను ఎంతగానో కలవరపెడుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube