టీడీపీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన కీలక నేత..!!

ఏపీలో పరిషత్ ఎన్నికల విషయంలో పోటీ చేయకుండా బహిష్కరిస్తూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయం ఆ పార్టీ కొంపముంచే విధంగా మారింది.బలవంతపు ఏకగ్రీవం అయినా పరిషత్ ఎన్నికలను స్టేట్ ఎలక్షన్ కమిషన్ కొనసాగిస్తున్నట్లు.

 Jyothula Nehru Senior Leader Resigns As Tdp Vice President ,  Chandrababu, Neela-TeluguStop.com

ఎస్ఈసీ నీలం సాహ్ని తీసుకున్న నిర్ణయం పై నిన్న చంద్రబాబు అధ్యక్షతన జరిగిన పోలిట్ బ్యూరో సమావేశంలో మండిపడి ఎన్నికలను బహిష్కరించడం జరిగింది.అప్రజాస్వామికంగా నిర్ణయాలు తీసుకుంటే ఎవరు మద్దతు తెలిపారు అని, ఆ సమయంలో నేతలకు కఠినమైన నిర్ణయం అయినా గాని తప్పదు అని పేర్కొన్నారు.

దీంతో టీడీపీ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబడుతూ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు.జగ్గంపేటలో కార్యకర్తలు మరియు అభ్యర్థుల సమక్షంలో పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలని పార్టీ నిర్ణయాన్ని తప్పు పడుతూ తన నిర్ణయాన్ని ప్రకటించారు.

జ్యోతుల నెహ్రూ మాత్రమే కాక తెలుగుదేశం పార్టీలో చాలా మంది కీలక నేతలు పరిషత్ ఎన్నికలను టీడీపీ  బహిష్కరించడాని ఖండిస్తున్నారు.తూర్పుగోదావరి లో కీలక నేత కాపు సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూ రాజీనామా చేయడం… టీడీపీ పార్టీకి భారీ డ్యామేజ్ జరిగినట్లే అంటూ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube