మలయాళీ దర్శకుడి తో కార్తీ చిత్రం.... సిస్టర్ గా జ్యోతిక  

Jyothika Sister Role In Hero Karthi Movie-

తమిళ హీరో కార్తీ కి తమిళనాట లో ఎంత గుర్తింపు ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. అలానే తెలుగు ఊపిరి చిత్రం లో నాగార్జున తో పాటు నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు కూడా పొందాడు. అయితే ఇప్పుడు కార్తీ తాజాగా మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ డైరక్షన్ లో ఒక చిత్రం చేస్తున్నాడు..

మలయాళీ దర్శకుడి తో కార్తీ చిత్రం.... సిస్టర్ గా జ్యోతిక -Jyothika Sister Role In Hero Karthi Movie

అయితే ఈ చిత్రంలో కార్తీ రియల్ లైఫ్ వదిన జ్యోతిక కార్తీ సిస్టర్ గా నటిస్తున్నట్లు సమాచారం.

మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా అల్లరి నరేష్ పక్కన నటించిన నిఖిల విమల్ కార్తీ కి జోడీ గా నటిస్తుంది. మేడ మీద అబ్బాయి చిత్రంలో హీరో అల్లరి నరేష్ కు జోడీ గా నటించిన నిఖిలా, కార్తీ పక్కన హీరోయిన్ గా ఛాన్స్ కొట్టిసింది.

ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ గోవా లో శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఊటీలో హీరో హీరోయిన్లు మధ్య కొన్ని లవ్ సీన్స్ చిత్రీకరిస్తున్నాడట దర్శకుడు జోసెఫ్. అయితే ఈ చిత్రంలో జ్యోతిక కూడా ఉండడం తో ఈ చిత్రం ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ చిత్రాన్ని వయాకామ్ 18, పారలెల్ మైండ్ బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ’96’ ఫేమ్ గోవింద్ వసంత్ సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తుంది. అన్నీ హంగులు పూర్తి చేసుకొని ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.