మాస్ జోడీ మరోసారి! సోగ్గాడి రొమాన్స్  

జ్యోతికతో మళ్ళీ జత కడుతున్న కింగ్ నాగార్జున .

Jyothika Romance With Nagarjuna Again After Mass-bangarraju Movie,jyothika Romance With Nagarjuna,tollywood

కింగ్ నాగార్జున కెరియర్ లో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఇక ఆ సినిమాలో నాగార్జున, జ్యోతిక లవ్ స్టొరీ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అవుతుంది. ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరి జంట మరో సారి తెరపై కనిపించలేదు..

మాస్ జోడీ మరోసారి! సోగ్గాడి రొమాన్స్-Jyothika Romance With Nagarjuna Again After MASS

అయితే పెళ్లి తర్వాత సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్ గా మొదలెట్టిన జ్యోతిక తాజా గా కింగ్ నాగార్జున తో రొమాన్స్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.సోగ్గాడే చిన్ని నాయనా అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టిన నాగార్జున మళ్ళీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫినిష్ కాగా ఇందులో నాగార్జున కి జోడీగా హీరోయిన్ కోసం దర్శకుడు వేట మొదలెట్టాడు.

ఇందులో ముందుగా నయనతారని అనుకున్న ఆమె చేయనని చెప్పడంతో ఆ పాత్రలో జ్యోతికని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. మరి మాస్ సినిమా తర్వాత మళ్ళీ జోడీ కడుతున్న వీళ్ళిద్దరి జంట ఎంత వరకు ప్రేక్షకులని మెప్పిస్తారు అనేది చూడాలి.