మాస్ జోడీ మరోసారి! సోగ్గాడి రొమాన్స్

కింగ్ నాగార్జున కెరియర్ లో లారెన్స్ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ మూవీ ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఇక ఆ సినిమాలో నాగార్జున, జ్యోతిక లవ్ స్టొరీ ప్రేక్షకులకి భాగా కనెక్ట్ అవుతుంది.

 Jyothika Romance With Nagarjuna Again After Mass-TeluguStop.com

ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరి జంట మరో సారి తెరపై కనిపించలేదు.అయితే పెళ్లి తర్వాత సినిమాలకి చాలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ రీసెంట్ గా మొదలెట్టిన జ్యోతిక తాజా గా కింగ్ నాగార్జున తో రొమాన్స్ కి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.

సోగ్గాడే చిన్ని నాయనా అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ సూపర్ హిట్ కొట్టిన నాగార్జున మళ్ళీ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఆ సినిమాకి సీక్వెల్ గా బంగార్రాజు సినిమా ప్లాన్ చేస్తున్నాడు.ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే ఫినిష్ కాగా ఇందులో నాగార్జున కి జోడీగా హీరోయిన్ కోసం దర్శకుడు వేట మొదలెట్టాడు.

ఇందులో ముందుగా నయనతారని అనుకున్న ఆమె చేయనని చెప్పడంతో ఆ పాత్రలో జ్యోతికని తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.మరి మాస్ సినిమా తర్వాత మళ్ళీ జోడీ కడుతున్న వీళ్ళిద్దరి జంట ఎంత వరకు ప్రేక్షకులని మెప్పిస్తారు అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube